మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (15:10 IST)

ఆస్కార్ వెళ్ళినా పోర్టబుల్ ఆలయాన్ని వదల్లేదు.. చెర్రీ దంపతులకు కితాబు

Ramcharan_Upasana
Ramcharan_Upasana
ఆర్ఆర్ఆర్ స్టార్ రామ్ చరణ్ ప్రార్థనల పట్ల మక్కువ చూపుతారు. చెర్రీ ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు తనతో పాటు తన ఇష్ట దేవతలతో కూడిన చిన్న పోర్టబుల్ ఆలయాన్ని తీసుకువెళతాడు. అతను ఆస్కార్ కోసం ప్రచారం చేస్తున్నప్పుడు లాస్ ఏంజిల్స్‌కు కూడా ఆ చిన్నపాటి ఆలయం అతనితో వెళ్ళింది.
 
"నేను ఎక్కడికి వెళ్లినా, నా భార్య.. నేను ఒక చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేస్తాం. ఇది మన శక్తితో, భారతదేశానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది" అని రామ్ చరణ్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియోలో చెప్పారు. రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన ప్రార్థనలు చేస్తున్న వీడియోను షేర్ చేశారు. 
 
రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాలకు చెర్రీ దంపతులు ప్రార్థనలు చేస్తున్నట్లు ఆ వీడియోలో చూడవచ్చు. అంతకుముందు కూడా రామ్ చరణ్ భక్తి ప్రవృత్తిని నెటిజన్లు మెచ్చుకున్నారు. చెర్రీ అయ్యప్ప దీక్ష చేపడతారన్న విషయం తెలిసిందే. ఈ దీక్షలో భాగంగా 40 రోజుల పాటు, నల్ల బట్టలు మాత్రమే ధరిస్తారు. చెప్పులు లేకుండా నడుస్తారు. మాంసాహారానికి దూరంగా ఉంటారు.