శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (14:30 IST)

రెండో బిడ్డకు ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించిన ఉపాసన!

upasana
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు, అపోలో గ్రూపు హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉపాసన మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను రెండో బిడ్డకు ప్లాన్ చేస్తున్నట్టు ఆమె చెప్పారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళల ఆరోగ్యంపై మాట్లాడారు. స్త్రీలు తమ ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందని, తమని తాము మాత్రమే తప్ప ఇంకెవరూపట్టించుకోరన్నారు. అందువల్ల ప్రతి ఒక్క మహిళకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 
 
మీ జీవితంలో కీలక నిర్ణయాలు ఎలా తీసుకోవాలన్నది తుది నిర్ణయం‌ మహిళలదేనని అభిప్రాయపడ్డారు. తాను పిల్లల్ని ఆలస్యంగా కనాలనుకున్నానని, తన పక్కనున్న మేడమ్‌ కూడా లేట్‌గానే పిల్లలు కావాలనుకున్నారని తెలిపారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు తానేమీ బాధపడటం లేదని, అది తన ఇష్టమని చెప్పారు. ప్రస్తుతం సెకండ్‌ ప్రెగ్నెన్సీకి కూడా తాను రెడీగా ఉన్నట్లు ఆమె చెప్పారు. ఈ మాటలకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, రామ్ చరణ్ చెర్రీ ఉపాసన దంపతులకు ఇప్పటికే క్లీంకార అనే కుమార్తె ఉన్న విషయం తెల్సిందే.