శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : గురువారం, 30 మే 2019 (18:51 IST)

ఫస్ట్ టైమ్.. పొలిటికల్ ఫంక్షన్‌కు హాజరైన వర్మ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురువారం విజయవాడలో సందడి చేశారు. స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. తన జీవితంలో మొదటిసారి రాజకీయ కార్యక్రమానికి వచ్చానని చెప్పుకొచ్చారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ చారిత్రాక విజయం సాధించారని ప్రశంసించారు. టీడీపీ ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంతోనే వైఎస్సార్‌సీపీకి ప్రజలు కట్టం కట్టారని అన్నారు. ప్రజల్లో చంద్రబాబు పాలనపై తీవ్ర అసంతృప్తి ఉండటం వల్లే టీడీపీ ఓటమి చెందిందన్నారు. 
 
వైఎస్‌ జగన్‌ మాటల్లోని నిజాయితీ ప్రజలకు కనెక్ట్‌ అయిందన్నారు. ఆయనపై ప్రజలు ఎంతో నమ్మ‍కం పెట్టుకుని అఖండ​ విజయంతో గెలిపించారని వివరించారు. వైఎస్‌ జగన్‌ మంచి పరిపాలన అందిస్తారన్న నమ్మకాన్ని రాంగోపాల్‌ వర్మ వ్యక్తం చేశారు.