శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (12:01 IST)

వర్మను చూస్తే కరోనా అయినా సరే పారిపోవాల్సిందే..?!

RGV
కరోనాను సైతం లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో రామ్ గోపాల్ వర్మకు కరోనా సోకిందా? లేదా మామూలు అనారోగ్యమేనా అనేది తెలియాల్సి ఉందంటూ ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై స్పందించిన వర్మ ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. 
 
చేతిలో డంబేల్ పట్టుకొని వర్కవుట్ చేస్తూ తన అనారోగ్యం పట్ల వస్తున్న వార్తలపై స్పందించారు వర్మ. ''నేను అనారోగ్యంగా ఉన్నానని, నాకు కోవిడ్ సోకిందేమో అనే అనుమానం కలుగుతోందని కొందరు సోషల్ మీడియాలో రూమర్స్ పుట్టిస్తున్నారు. వాళ్లందరినీ డిజప్పాటింట్ చేస్తూ, మీ సంతోషానికి చెక్ పెడుతూ నేను చెప్పేది ఒక్కటే.. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. వరుసపెట్టి ఇంట్రెస్టింగ్ సినిమాలు రూపొందిస్తున్నాను. సూపర్ ఫకింగ్ ఫైన్'' అన్నారు. 
 
దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆర్జీవీ స్టైల్‌లోనే కామెంట్స్ చేస్తుండటం విశేషం. 'వర్మను చూస్తే కరోనా అయినా సరే పారిపోవాల్సిందే' అంటూ రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు.