ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 20 జనవరి 2019 (16:08 IST)

'బాహుబ‌లి' క‌ట్ట‌ప్ప వెన్నుపోటు ఫోటోకు మార్ఫింగ్ చేసి...

వివాదాస్ప దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈయన తాజా చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్". వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. కానీ, ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనంగా మారింది. ముఖ్యంగా.... ల‌క్ష్మీ పార్వ‌తి జీవిత కోణం నుంచి ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. 
 
ఈ సినిమాకి సంబంధించిన తొలి పోస్ట‌ర్‌తోనే వివాదాలు రేపిన వ‌ర్మ ఇటీవ‌ల వెన్నుపోటు అనే సాంగ్ విడుద‌ల చేశాడు. ఈ సాంగ్‌పై పలు అభ్యంత‌రాలు వ్య‌క్తమయ్యాయి. అయినా ఆయన ఎక్కడ వెనక్కి తగ్గలేదు. 
 
ఇక ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా వెన్నుపోటు ద్వారా చంపబడిన ఎన్టీఆర్ మళ్లీ లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపంలో బతికి వ‌చ్చారంటూ ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశాడు. 
 
ఇక‌ తాజాగా బాహుబ‌లి చిత్రంలో బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప వెన్నుపోటు పొడిచిన పోస్ట‌ర్‌ని కాస్త మార్ఫింగ్ చేసి ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. ఈ ఫోటోలోని వ్య‌క్తులు నాకు స‌రిగా గుర్తు రావ‌డం లేదు. వారెవ‌రో గుర్తించ‌డంలో కాస్త సాయం చేయండి అంటూ కామెంట్ పెట్టాడు. 
 
దీంతో ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వర్మ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కీలక పాత్రల్లో యాగ్న శెట్టి, శ్రీతేజ్‌లతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కళ్యాణ్ మాలిక్ స్వరాలు సమకూర్చుతున్నాడు.