మంగళవారం, 19 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవి
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2025 (19:38 IST)

అర్.సి. 16 షూటింగ్ లో క్లిన్ కారా తో జాయిన్ అయిన రాంచరణ్ - తాజా అప్ డేట్

Clin Kara, Rancharan
Clin Kara, Rancharan
రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతోన్న ఆర్‌.సి. 16 సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ లో బూత్‌ బంగ్లాలో జరుగుతోంది. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్‌ లో క్రికెట్‌ కు సంబంధించిన మ్యాచ్‌ లు జరుగుతున్నాయని తెలిసింది. ఐదు టీమ్‌ లుగా ఏర్పడిన ఈ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. రామ్‌ చరణ్‌ ఫీల్డులోకి వచ్చేముందు పెద్ది.. పెద్ది.. అంటూ ఆనందంతో కేకలు వేయడం జరిగింది. నైట్‌ లో నే షూట్‌ జరుగుతున్నందున నిన్న రాత్రి రామ్‌ చరణ్‌ తన కుమార్తె క్లింకారాను తీసుకుని సెట్‌ లోకి వచ్చారు. అక్కడ నైట్‌ లైట్‌ ల ఎఫెక్ట్‌లు చూపిస్తూ కుమార్తె ఆనందించడంతో ఖుషీ అయ్యాడు. 
 
కొద్దిసేపు అక్కడే వుండి ఆ తర్వాత చరణ్‌ వెళ్ళిపోయారు. ఈరోజు మిగిలి టీమ్‌ తో మ్యాచ్‌ ఆడుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు  బుచ్చిబాబు యూత్‌ఫుల్‌ కథతో ముందుకఁ వస్తున్నారు. మరి ఈ సిఁమా రామ్‌ చరణ్‌ కు ఏస్థాయిలో వుంటుందో చూడాలి. సంక్రాంతికి వచ్చిన గేమ్ chaanger చరణ్ కు డిజాస్టర్ గా నిలిచింది. దర్శకుడు శంకర్ కు ప్లాప్ ఇచ్హింది. నిర్మాత దిల్ రాజుకు నిరాసపరచింది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.