బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (15:07 IST)

ఆరుగురు అమ్మాయిలతో 10 మంది యువకుల జల్సా!

రేవ్ పార్టీ పేరుతో ఆరుగురు అమ్మాయిలతో పది మంది యువకులు జల్సా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిలో ఓ కంపెనీ మేనేజరు కూడా ఉన్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసరలో వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కీసరలో ఆదివారం రాత్రి ఓ ఫెర్టిలైజర్‌ వ్యాపారి తిమ్మాయిపల్లిలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్‌లో సన్నిహితుల కోసం ఆరుగురు అమ్మాయిలతో రేవ్‌ పార్టీ ఏర్పాటు చేశాడు. సిద్దిపేట, నల్గొండ, వరంగల్, గజ్వేల్‌కు చెందిన డీలర్‌లు ఇందులో పాల్గొన్నారు. 
 
విందులు, అమ్మాయిలతో చిందులతో వారు రచ్చరచ్చ చేశారు. ఈ రేవ్ పార్టీ గురించి సమాచారాన్ని స్థానికులకు పోలీసులకు చేరవేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు... ఆరుగురు యువతులతో పాటు.. 10 మంది యువకుల్ని అరెస్టు చేశారు. 
 
వీరిలో బెస్ట్‌ క్రాఫ్ట్స్ సీడ్స్ కంపెనీ మేనేజర్‌ కూడా ఉన్నారు. వీరి నుంచి సెల్‌ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులకు గదిలోకి ప్రవేశించిన సమయంలో అమ్మాయిలు అర్థనగ్నంగా కంటపడ్డారు.