ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 22 జులై 2024 (17:17 IST)

నా తప్పుల నుంచే ఎక్కువ నేర్చుకున్నా : రాయన్ హీరో ధనుష్

Dhanush, Sandeep Kishan, D. Suresh Babu, Aparna Balamurali, Prakash Raj
Dhanush, Sandeep Kishan, D. Suresh Babu, Aparna Balamurali, Prakash Raj
ధనుష్ యాక్టర్ గా తన 50 మైల్ స్టోన్ మూవీ 'రాయన్'కి దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.  
 
హీరో ధనుష్ మాట్లాడుతూ.. ఐ యామ్ వెరీ లక్కీ. నా కెరీర్ లో చాలా మంచి ఫిలిం మేకర్స్ తో కలసి పని చేసే అవకాశం దొరికింది. సెల్వ రాఘవన్, సుబ్రహ్మణ్యం శివ, భూపతి పాండియన్, వెట్రిమారన్.. ఇలా నాతో సినిమాలు చేసిన దర్శకులందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా కెరీర్‌లో నేను నా తప్పుల నుంచే ఎక్కువ నేర్చుకున్నా. అందుకే మనం చేసే మిస్టేక్స్ కి థాంక్ ఫుల్ గా వుండాలి.

డైరెక్షన్ చాలా భాద్యతతో కూడుకున్నది. నాకు నటనపైన ఎంత ఇష్టం ఉందో దర్శకత్వంపైనా అంతే ఇష్టముంది. నేను డైరెక్టర్ చేసిన రాయన్ 26న వస్తోంది. ఇదొక బ్లెసింగ్ గా భావిస్తున్నాను. నిర్మాత కళానిధి మారన్ గారికి, ఎఆర్ రెహ్మాన్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి, ఎస్జే సూర్య, సందీప్, అపర్ణ, నా టెక్నికల్ టీం అందరికీ పేరుపేరునా థాంక్ యూ. నన్ను ఎంతగానో అభిమానించే తెలుగు ఆడియన్స్ కి ధన్యవాదాలు. నా నుంచి కోరుకునే మంచి డైలాగ్స్, యాక్షన్, సాంగ్స్ అన్నీ రాయన్ లో ఉన్నాయి. ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాను. రాయన్ నా యాభైవ సినిమా. చాలా మంచి సినిమా. జూలై 26న రిలీజ్ అవుతుంది. థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి' అన్నారు.
 
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ధనుష్ ఒక నటుడిగా వాళ్ళ ఆకలిని తీర్చడానికి ఏం కావాలో తెలిసిన వ్యక్తి.  ధనుష్ కి దర్శకుడిగా చాలా స్పష్టత వుంది. ఈ సినిమాని డైరెక్టర్ చేస్తూ, ఇళయరాజా గారి బయోపిక్ కి రెడీ అవుతూ, శేఖర్ కమ్ముల గారితో సినిమా చేస్తూ.. నన్ను నిత్యామీనన్ ని పెట్టి తన దర్శకత్వంలో ఓ కథ చెప్పాడు. ఇలాంటి  కృషిని చూస్తున్నపుడు ఇది కదా సినిమాకి కావాల్సిందనిపిస్తుంది. తను జనరేషన్స్ కి స్ఫూర్తి. రాయన్ 26న వస్తోంది. మరో కొత్త అనుభవం. ధనుష్ ఇంకో విశ్వరూపం. ఆల్ ది బెస్ట్' తెలిపారు.
 
హీరోయిన్ అపర్ణ బాలమురళి మాట్లాడుతూ.. మీ అందరికీ అభిమానానికి థాంక్ యూ. రాయన్ వెరీవెరీ స్పెషల్ మూవీ. ధనుష్ గారికి పెద్ద ఫ్యాన్స్ ని . ఆయన డైరెక్షన్ లో నటించడం, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. రాయన్ బ్యూటీఫుల్ జర్నీ. ధనుష్ గారు రాయన్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. సినిమా తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది' అన్నారు.  
 
హీరోయిన్ తుషారా విజయన్ మాట్లాడుతూ.. రాయన్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. నేను ధనుష్ గారికి పెద్ద ఫ్యాన్ ని, ఆయన డైరెక్ట్ చేసిన ఫిల్మ్ లో ఆయనతో కలసి నటించడం ఆనందంగా వుంది. అపర్ణ, కాళి, ప్రకాష్ రాజ్ సర్, ఎస్ జే సూర్య గారు లాంటి అద్భుతమైన నటులతో నటించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. సన్ పిక్చర్స్ కి, ఏసియన్ సినిమాస్ కి థాంక్ యూ.' అన్నారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.