శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 27 జనవరి 2018 (13:28 IST)

రజనీకాంత్ "2.O" టీజర్‌పై దర్శకుడు శంకర్ క్లారిటీ

సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం "2.O". ఎస్. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 3డీ ఫార్మాట్‌లో ప్రేక్షకుల ముందుక

సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం "2.O". ఎస్. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 3డీ ఫార్మాట్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఈ సినిమా వచ్చే ఏప్రిల్ 14వ తేదీన తమిళ కొత్త సంవత్సరాదికి విడుదల కానుందనే టాక్ బాగా వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, దుబాయ్‌లో జరిగిన ఆడియో వేడుక సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. సినిమా టీజర్, ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. 
 
అయితే తాజాగా, దర్శకుడు శంకర్ భారత గణతంత్ర వేడుకల సందర్భంగా అభిమానులకు కొంచెం ఊరటను కలిగించేలా ట్వీట్ చేశాడు. లాస్ ఏంజిల్స్‌లోని ప్రముఖ మాబ్ సీన్ సంస్థలో టీజర్‌కి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని ఆ గ్రాఫిక్స్ వర్క్స్ ఫినిష్ అయితే టీజర్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని శంకర్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు.