గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: శుక్రవారం, 27 నవంబరు 2020 (20:01 IST)

ఘనంగా ప్రారంభమైన రెడ్డీస్ మల్టీప్లెక్స్

ఇది కలియుగం కాదు, డిజిటల్ యుగం. మనకి ఏది కావాలి అన్న వార్త అయినా వినోదం అయినా క్షణంలో మన ముందుంటుంది. ఇప్పుడున్న దిన పత్రికలూ టీవి ఛానల్ కన్నా ధీటైనది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో అతిముఖ్యమైనది యూ ట్యూబ్. ప్రపంచంలో జరిగే వింతలు విశేషాలు యూట్యూబ్‌లో క్షణంలో ప్రత్యక్షం. యూట్యూబ్ మన జీవితంలో భాగం అయిపోయింది.
 
ఇప్పుడు రెడ్డీస్ మల్టీప్లెక్స్ వారు ప్రేక్షకులను మరింత కనువిందు చేయటానికి సరికొత్త ఛానల్‌తో మన ముందుకు వస్తున్నారు. పొలిటికల్ ప్రియులకు పొలిటికల్ ఛానల్, మహిళల కోసం మహిళా ఛానల్, స్టూడెంట్స్‌కి ఎడ్యుకేషనల్ ఛానల్, సినిమా ప్రేక్షకులకి ఆర్ - ఫ్లెక్స్ (R-Flex OTT ) ఓటిటిని ఇలా ఎన్నో సరికొత్త చానెల్స్‌ని అంగరంగ వైభవంగా హైదరాబాద్ లోని  పార్క్ హయాత్ హోటల్‌లో అతిథుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. 
 
రెడ్డీస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి దర్శకుడు ఎస్వి కృష్ణా రెడ్డి, నగరి ఎమ్ఎల్ఏ రోజా, మాజీ ఎంపి మధు యాష్కీ గౌడ్, నరసింహా రెడ్డి, విద్యావతి, అవినాష్ రెడ్డి, రవిచంద్ర రెడ్డి, స్నేహ, శైలజా చరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి, బియగూడ హరీష్, తదితరులు పాల్గొన్నారు.
 
అనంతరం నగరి ఎమ్ఎల్ఏ రోజా మాట్లాడుతూ, "మహిళలకి అవకాశం ఇస్తే ఎంత ఎత్తయినా ఎదుగుతారు. దానికి నిదర్శనమే శైలజ చరణ్ రెడ్డి. యూట్యూబ్ ఛానల్, ఓ టి టి సినిమాలు, టి వి ఛానల్ ఇవి అన్ని చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యాపారాలు. మా శైలజ రెడ్డి గారికి ధైర్యం ఎక్కువ, వారు ఈ రంగంలో కూడా మంచి విజయం సాధించాలి అని వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులని మరింత ఎంటర్టైన్ చేయాలనీ కోరుకున్నారు.