గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (11:18 IST)

కిరణ్ అబ్బవరం - నేహాశెట్టి జంటగా నటించిన "రూల్స్ రంజన్" రిలీజ్ డేట్ ఫిక్స్

rules ranjan
కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం "రూల్స్ రంజన్" చిత్రాన్ని వచ్చే నెల ఆరో తేదీన విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. నిజానికి ఈ చిత్రాన్ని ముందుగానే రిలీజ్ చేయాలని భావించారు. కానీ, కొన్ని అనివార్య కారణాలతో వాయిదా వేశారు. దివ్యాంగ్ - మురళీకృష్ణ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. అమ్రిష్ గణేశ్ సంగీతం సమకూర్చారు.
 
తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. అక్టోబరు 6వ తేదీన విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ఓ పోస్టరును రిలీజ్ చేశారు. కిరణ్ అబ్బవరం నటించే చిత్రాల్లో మంచి ఎంటర్‌టైన్మెంట్ ఉంటుందనే నమ్మకం ఆడియన్స్‌లో ఉంది. ఇక నేహాశెట్టికి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.