'రైజ్ ఆఫ్ శ్యామ్' అంటున్న నాని.. లిరికల్ సాంగ్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం "శ్యామ్ సింగ రాయ్". 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని 1970 కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో డిసెంబర్ 24న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది.
ఇందులోభాగంగా, 'రైజ్ ఆఫ్ శ్యామ్' ఫుల్ లిరికల్ సాంగ్‌ని శనివారం ఉదయం విడుదల చేసింది. బాలీవుడ్ సింగర్ విశాల్ దద్లానీ పాడిన ఈ పాట ఉర్రూతలూగిస్తుంది. "అరే ఎగసెగిసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్.. అరే తిరగబడిన సంగ్రామం వాడే.." అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంటోంది. శ్యామ్ సింగ రాయ్ ఒక లెజెండ్‌గా ఎలా మారాడో ఈ పాట వివరిస్తుంది. మెలోడీ సాంగ్స్ స్పెసిలిస్ట్‌గా పిలబడే మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు.
కాగా, ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హీరోయిన్లుగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ నటించారు. ఇది నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం కావడం గమనరాహ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‍పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు.