1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 మే 2025 (09:06 IST)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

rajamouli cherry tarak
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటించారు. అయితే, ఇపుడు ఈ చిత్రం రెండో భాగం తెరకెక్కనుందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రామజౌళిని ఈ చిత్ర హీరోలిద్దరూ ఆటపట్టిస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
'ఆర్ఆర్ఆర్-2'కు ఇదివరకే పలుమార్లు దర్శకుడు రామజౌళి సానుకూలంగా స్పందించారు. తాజాగా దీనిపై స్పష్టతనిచ్చారు. చెర్రీ, తారక్‌ల మధ్య స్నేహబంధం అందరికీ తెలిసింది. వారి అనుబంధానికి సంబంధించిన అనేక వీడియోలు ఇదివరకే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరో వీడియో ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వీడియోలోనే రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు దర్శకుడు రాజమౌళిని ఆటపట్టిస్తూ సందడి చేయడం కనిపిస్తుంది. 'ఆర్ఆర్ఆర్-2' ఎపుడు చేస్తారని ఒకరు అడుగగా రాజమౌళి తప్పకుండా చేస్తాం అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
'ఆర్ఆర్ఆర్' లైవ్ కాన్సర్ట్‌లో ఈ దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఈ కార్యక్రమం లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో కొద్ది రోజుల క్రితం జరిగింది. ఈ వేడుకలో రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిలు పాల్గొన్నారు.