1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 8 అక్టోబరు 2015 (20:49 IST)

రుద్రమదేవి సీక్రెట్స్... నెట్‌లో హల్‌చల్... ఏంటవి?

అనుష్క ప్రధానపాత్రలో రానా, అల్లు అర్జున్ నటించిన రుద్రమదేవి రేపే... అంటే అక్టోబరు 9న విడుదలకు రెడీ అయ్యింది. ఈ చిత్రంలో రాణీ రుద్రమదేవి జీవితాన్ని దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. ఐతే రుద్రమదేవికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ అంటూ నెట్లో కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాకతీయ రాజైన గణపతిదేవుని కుమార్తె రుద్రమదేవి. ఐతే ఆమెను ఆయన చిన్నప్పట్నుంచి అబ్బాయిలా వేషధారణ చేసి ఆమెను రుద్రదేవుడిగా ప్రజలకు తెలిసేట్లు చేశాడు. 
 
రుద్రమదేవి కూడా రుద్రదేవుడిలా పురుష వేషంలో ఉండేది. తండ్రికి సహాయంగా పాలనలో పాలుపంచుకునేది. తండ్రి పరమపదించేవరకూ ఆమె అలానే ఉన్నట్లు చరిత్రను బట్టి తెలుస్తోంది. ఇదిలావుంటే రుద్రదేవుడిగా ఉన్న రుద్రమదేవికి పెళ్లి చేశారనీ, ఆమెను పురుషుడిగానే భావించి ముమ్ముడమ్మ అనే స్త్రీతో వివాహం చేశారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ చరిత్రలో చూస్తే... తండ్రి గణపతిదేవుడు చనిపోగానే రుద్రమదేవి తను స్త్రీ అని లోకానికి తెలుస్తుంది. 
 
ఆ సమయంలో రాజ్యంలో వ్యతిరేకవర్గం ఆమె సింహాసనం అధిష్టించేందుకు నిరాకరిస్తుంది. స్త్రీ పాలన ఎలా చేయగలదని నిలదీసి ఆమెను ఓడించి పాలనాపగ్గాలు చేపట్టేందుకు ప్లాన్ చేస్తుంది. ఐతే వారిని తన అనుచరగణంతో ఓడించి రుద్రమదేవి తిరిగి పాలనపగ్గాలు చేపడుతుంది. ఆ తర్వాత కాలంలో ఆమె వీరభద్రుడిని వివాహమాడుతుంది. కొంతకాలం వారికి బిడ్డలు కలుగకపోవడంతో ముమ్మడమ్మతోపాటు మరో అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకున్నారని చరిత్రలో కనబడుతుంది. మొత్తమ్మీద రుద్రమదేవి చిత్రం విడుదల కాబోతున్న తరుణంలో రుద్రమదేవి జీవితం గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.