సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 28 మే 2019 (18:31 IST)

క్యూ కడుతున్న నిర్మాతలు... ఒక్కసారిగా పెంచేసిన పాయల్ (video)

"ఆర్ఎక్స్ 100" చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్. ఈ ఒక్క చిత్రంతోనే ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. గ్లామర్ పరంగా యూత్ హృదయాలను కొల్లగొట్టింది. ఇటు తెలుగు తమిళ భాషల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తన మాతృభాష పంజాబీలోనూ ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తన పారితోషికాన్ని అమాంతం పెంచేసింది. 
 
ప్రస్తుంత తెలుగులో అక్కినేని నాగార్జున నటిస్తున్న "మన్మథుడు-2", విక్టరీ వెంకటేష్ నటిస్తున్న "వెంకీమామ", రవితేజా నటించే "డిస్కోరాజా" చిత్రాల్లో పాయల్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీటితో పాటు యువరత్న బాలకృష్ణ - కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం నిర్మాత సి.కళ్యాణ్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. 
 
బాలకృష్ణ చిత్రం కోసం ఆమె రూ.75 లక్షల నుంచి రూ.కోటి మేరకు డిమాండ్ చేసినట్టు సమాచారం. అయితే, ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వాలా వద్దా అనే అంశంపై చిత్ర దర్శకనిర్మాతలు తర్జనభర్జనలు చెందుతున్నారట. అయితే, పాయల్‌కు అటు మాస్, ఇటు యూత్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆమె డిమాండ్ చేసిన మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.