మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 3 అక్టోబరు 2018 (13:50 IST)

RX 100 హీరోకు కోపమొచ్చింది.. మేం ఆర్టిస్టులమే.. టెర్రిస్టులం కాదు..

ఆరెక్స్ 100 సినిమా హీరోకు కోపం వచ్చింది. RX 100 సినిమాలో సన్నివేశాల ప్రభావంతోనే జగిత్యాలలో ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెప్పడం, ఆ తర్వాత ఇది వివాదాస్పదం కావడంతో కా

ఆరెక్స్ 100 సినిమా హీరోకు కోపం వచ్చింది. RX 100 సినిమాలో సన్నివేశాల ప్రభావంతోనే జగిత్యాలలో ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెప్పడం, ఆ తర్వాత ఇది వివాదాస్పదం కావడంతో కార్తికేయ ట్విట్టర్‌లో హీరో కార్తికేయ స్పందించాడు. జనాలకు వినోదం పంచాలనే ఉద్దేశంతోనే తాము సినిమాలు తీస్తామని.. తాము ఆర్టిస్టులమే తప్ప టెర్రరిస్టులం కాదని కార్తికేయ స్పష్టం చేశాడు. 
 
RX 100 అనే సినిమాలో గానీ… పిల్లా రా అనే పాటలో గానీ హీరో సూసైడ్ చేసుకున్నట్టు ఎక్కడా లేదు… హీరోయిన్ పాత్రధారి అయిన ఇందు హీరోను చంపేందుకు మాత్రమే ప్రయత్నిస్తుంది. ఇందులో హీరో ఎక్కడా ఆత్మహత్య చేసుకోడనే విషయాన్ని కార్తీకేయ గుర్తు చేశాడు.

మరి పిల్లలు సూసైడ్ చేసుకున్న విషయంలో తమను బాధ్యులను చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటూ కార్తీకేయ ప్రశ్నించాడు. ఆర్టిస్టులు, డైరెక్టర్లను టెరర్రిస్టుల్లాగా చూడటం సరికాదని.. మమ్మల్ని తిట్టడం మానేసి.. చుట్టుపక్కల వున్నవారిని మోటివేట్ చేయడం మొదలెట్టండి అంటూ హితవు పలికాడు. 
 
సినిమాల్లో నెగటివీని తీసుకోండని ఎవ్వరూ చెప్పరని.. ఇద్దరు పిల్లలు నెగటివ్‌గా మారుతున్నారనిపిస్తే.. అది గమనించినవారు.. వారి మైండ్ సెట్‌ను మార్చాలని కార్తీకేయ తెలిపాడు. కాగా కార్తికేయ వివరణను చాలామంది సమర్థిస్తున్నారు. కొందరు వ్యతిరేకిస్తున్నారు.