గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (17:38 IST)

మెగా హీరో తేజ్ ఆరోగ్యం నిలకడగా వుంది.. కోలుకుంటున్నారు.. వైద్యులు

మెగా హీరో, సుప్రీమ్ కథానాయకుడు, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. తేజ్ ఆరోగ్యం పట్ల కంగారు పడాల్సిన అవసరం లేదని..  ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు.. మెగా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. 
 
సాయి ధరమ్ తేజ్ మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి ప్రమాదం బారినపడిన సంగతి తెలిసిందే. వెంటనే సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు తేజ్‏ను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి చేర్పించి అత్యవసర చికిత్స అందించారు. 
 
అనంతరం అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అపోలో వైద్యులు తేజ్ కోలుకుంటున్నట్లు వెల్లడించారు. సాయికి ఆదివారం శస్త్రచికిత్స జరిగిందని.. సోమవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. 
 
తేజ్ కాలర్‌ బోన్‌కు చేసిన ఆపరేషన్‌ విజయంతం అయ్యింది. ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నారు. మొదటిలో ఉన్న దానికంటే వెంటిలేటర్‌ అవసరం ఇప్పుడు తగ్గింది. ఇంకా ఆయనను 36 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాల్సి ఉందన్నారు వైద్యులు.