శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Modified: గురువారం, 8 నవంబరు 2018 (16:33 IST)

సాయి పల్లవి 'మారి' లుక్... నెట్‌లో వైరల్...

'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. ఆ తర్వాత నానితో కలిసి 'ఎంసిఏ' చిత్రంలో నటించింది. మొదటి సినిమా ఫిదాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కుర్రహీరో నాగసౌర్యతో కలిసి కణం చిత్రంలో నటించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినప్పటికీ వరుస ఆఫర్లు వచ్చేలా చేసింది. 
 
ప్రస్తుతానికి తెలుగులో శర్వానంద్ సరసన 'పడిపడి లేచే మనసు' చిత్రంలో, అలాగే తమిళంలో సూర్య సరసన 'ఎన్జీకే' చిత్రంలో, ధనుష్ సరసన 'మారి 2' చిత్రాల్లో నటిస్తోంది. అయితే గతంలో ధనుష్ నటించిన మారి చిత్రానికి సీక్వెల్‌గా బాలాజీ మోహన్ దర్శకత్వంలో వస్తున్న మారి 2 చిత్రంలోని సాయిపల్లవి లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
సాయిపల్లవి మాస్ లుక్‌లో ఆటో డ్రైవర్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో ఆటో డ్రైవర్ పాత్ర కోసం ఆటో డ్రైవింగ్ కూడా నేర్చుకుందంట సాయిపల్లవి. ఈ ఫస్ట్ లుక్ మారి 2పై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.