శనివారం, 2 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 8 జనవరి 2024 (15:37 IST)

సంక్రాంతి కి వస్తున్న సైంధవ్‌.. పండగే పండగ అన్నట్టుగా ఉంటుంది: వెంకటేష్

Venkatesh - Shailesh Kolanu - Shraddha Srinath - Ruhani Sharma
Venkatesh - Shailesh Kolanu - Shraddha Srinath - Ruhani Sharma
విక్టరీ వెంకటేష్ 75 మూవీ‘సైంధవ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. నా తొలి సినిమా నుంచీ వైజాగ్ తో అనుబంధం ఉంది. కలియుగ పాండవులు, సుందరకాండ, మల్లీశ్వరి. సీతమ్మ వాకిట్లో, గోపాలగోపాల ఇలా చాలా చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. 'సైంధవ్‌’ చిత్రీకరణ కూడా చాలా రోజులు ఇక్కడే చేశాం. అభిమానులు, ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ చూసేలా నా 75వ చిత్రంగా న్యూ ఏజ్ యాక్షన్, ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా  ‘సైంధవ్‌’ని తీశాం.

దర్శకుడు శైలేష్ అద్భుతంగా ప్రజంట్ చేశారు. మీకు నచ్చే యాక్షన్ చాలా కొత్తగా చేశాను. మంచి సినిమా ఇవ్వాలని అందరం కష్టపడి పని చేశాం. ఇది పండగ రోజు వస్తుంది. పండగే పండగ అన్నట్టుగా ఉంటుంది. జనవరి 13న  మీ ముందుకు వస్తోంది. బ్రహ్మండంగా వుంటుంది. తప్పకుండా చూడండి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా  మనస్పూర్తిగా థాంక్స్. ఈ సినిమాకి హీరో సారా పాపే. చాలా అద్భుతంగా నటించింది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. జనవరి 13. మీరంతా రావాలి. సినిమా చూడాలి' అని కోరారు
 
దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ.. వైజాగ్ తో నాకు చాలా మంచి అనుబంధం వుంది. HIT చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. ఇప్పుడు 'సైంధవ్‌’ కూడా ఇక్కడ చిత్రీకరణ చేశాం  అయిపోయా. వెంకటేష్ గారి 75వ చిత్రం చేసే అవకాశం రావడం నా అదృష్టం. దీనికి న్యాయం చేశానని నమ్ముతున్నాను. టీం అంతా ప్రాణం పెట్టి పనిచేశాం. వెంకటేష్ గారితో ప్రయాణం మర్చిపోలేనిది. ఆయన నా జీవితాన్ని మార్చేశారు. సినిమాని గొప్పగా తీశాననే నమ్ముతున్నాను. వెంకీ మామ 75వ చిత్రాన్ని సెలబ్రేట్ చేసుకునే భాద్యత ప్రేక్షకులు,అభిమానులది. జనవరి 13న థియేటర్స్ లోకి వెళ్లి సెలబ్రేట్ చేయండి. నిర్మాత వెంకట్ గారి ధన్యవాదాలు. వారితో మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.  జనవరి 13న అందరూ థియేటర్స్ కి వెళ్లి సైంధవ్ ని ఎంజాయ్ చేయండి'' అని కోరారు.
 
 శ్రద్ధా శ్రీనాథ్‌ మాట్లాడుతూ.. వెంకటేష్ గారి 75వ సినిమాలో నటిచండం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా అందరి హృదయాల్ని గెలుచుకోవాలని, థియేటర్‌ నుంచి బయటికొస్తే అందరి మొహాల్లో ఓ ఆనందం ఉండాలి. అది ఈ చిత్రంతో కలుగుతుంది. నిర్మాత వెంకట్ గారికి ధన్యవాదాలు. శైలేష్ అద్భుతంగా సినిమాని తీశారు. టీంలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. జనవరి 13న అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి' అని కోరారు.
 
రుహాని శర్మ మాట్లాడుతూ.. సైంధవ్ లో అన్నీ ఎమోషన్స్ వున్నాయి. ఈ సినిమా చూసి థియేటర్‌ నుంచి బయటికొస్తే అందరి మొహాల్లో ఓ ఆనందం వుంటుంది. ప్రతి పాత్ర, ప్రతి భావోద్వేగం నచ్చుతుంది. వెంకటేష్ గారికి నేను ఫ్యాన్ ని. ఆయనతో వర్క్ చేసిన తర్వాత ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. నిర్మాత వెంకట్ గారికి ధన్యవాదాలు. ‘హిట్‌’ తర్వాత ఈ సినిమాలో మళ్లీ ఓ పవర్ ఫుల్ పాత్రని ఇచ్చినందుకు శైలేశ్‌కి కృతజ్ఞతలు.  ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టాం. సెకండ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేస్తాం'' అన్నారు
 
నిర్మాత వెంకట్ బోయినపల్లి మాట్లాడుతూ, నా తొలి చిత్రాన్ని వెంకటేష్ గారితో చేయాలని అనుకున్నాను. కానీ అది కుదరలేదు. ఆయన తొలిసారి బ్రహ్మపుత్రుడు అనే సినిమా షూటింగ్ లో తొలిసారి చూశాను. అప్పటి నుంచి ఆయన అభిమానిని. ఆయన 75వ మైల్ స్టోన్ మూవీగా ఈ చిత్రాన్ని నేను నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నాను. వెంకటేష్ గారికి కృతజ్ఞతలు’’ తెలిపారు.
 
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, ఇందులో మంచి సాహిత్య విలువలతో కూడిన పాటలు రాశాను. క్లైమాక్స్ లో వచ్చే బిట్ సింగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఇది గొప్ప చిత్రం, చరిత్రని తిరగరాసే చిత్రం అవుతుంది. ఇందులో నాతో చిన్న క్యామియో రోల్ కూడా చేయించారు శైలేష్. సంతోష్ నారాయణ్ చాలా అద్భుతమైన సంగీతం అందించారు. జనవరి 13 కోసం మీఅందరితో పాటు నేను ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో బేబీసారా, డీవోపీ మణికందన్, ఎడిటర్ గ్యారీ బిహెచ్ తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.