గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 6 జనవరి 2024 (16:58 IST)

సైంధవ్ లో యాక్షన్ చేయడం సవాల్ గా అనిపించింది - ఓషో పాత్ర నా డ్రీమ్ : నవాజుద్దీన్ సిద్ధిఖీ

Nawazuddin Siddiqui
Nawazuddin Siddiqui
-ప్రతి నటుడు ఒక మంచి కథ కోసం ఎదురుచూస్తాడు. నేను కూడా అలా సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూశాను. అది 'సైంధవ్’ తో కుదిరింది. చాలా ఆసక్తికరమైన కథ ఇది. వెంకటేష్ గారితో కలసి పని చేయడం ఎవరికైనా ఒక డ్రీం. ఆయనతో కలసి పని చేయడం చాలా అనందంగా వుంది అని యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలిపారు.
 
విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ‘సైంధవ్’. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలేకర్ల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ప్రేక్షకుల వస్తోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో నవాజ్ కెలక పాత్ర పోషిణిచారు. ఆయనలా మాటల్లో..  నాకూ  డ్రీమ్ రోల్ ఉంది. 
ఓషో పాత్ర చేయాలని వుంది. అవకాశం వస్తే ఆయన బయోపిక్ చేస్తాను. 
 
సైంధవ్ లో విలన్ గా కనిపించడానికి ప్రత్యేకమైన కారణం ఉందా ?
-నేను ఎప్పుడూ విలన్, హీరో పాత్ర అని చూడలేదు. పాత్ర ఆసక్తికరంగా ఉందా లేదా అనేదే ముఖ్యం. కొన్ని సార్లు పాజిటివ్ రోల్స్ కంటే నెగిటివ్ రోల్స్ లో పెర్ఫార్మ్ చేసే అవకాశం ఎక్కువగా వుంటుంది. సైంధవ్ లో దర్శకుడు శైలేష్ చాలా యూనిక్ రోల్ ని డిజైన్ చేశారు. నటించడానికి చాలా అవకాశం వున్న పాత్ర.
 
తెలుగు భాష నేర్చుకోవడంలో ఎలాంటి సవాళ్ళు ఎదురుకున్నారు ?
-ఈ విషయంలో దర్శకుడు శైలేష్ ప్రేరణ ఇచ్చారు. నా నటనకు వేరే ఎవరో డబ్బింగ్ చెప్పడం కూడా నాకు ఇష్టం వుండదు. పాత్రలో ఆ డెప్త్ రాదు. ఇందులో నాది హైదరాబాది పాత్ర. హిందీ, కొంచెం తెలుగు రెండూ మాట్లాడే పాత్ర. ఆ పాత్రకు నేను డబ్బింగ్ చెబితేనే న్యాయం జరుగుతుంది.  భాషని, భావాన్ని అర్ధం చేసుకొని చెప్పాను. ఏదైనా కొత్త భాష నేర్చుకున్నప్పుడు మొదట్లో కొంత కష్టంగానే వుంటుంది. భాష గురించి తెలుసుస్తున్న కొద్ది అది సులువైపోతుంది. నాకు ప్రామ్టింగ్ మీద నమ్మకం లేదు. ఎంత కష్టమైన నా డైలాగులని నేర్చుకుని చెప్పడమే ఇష్టం. సైంధవ్ లో కూడా అలా ప్రతిది నేర్చుకొని చెప్పాను.
 
తెలుగు సినిమాలు చూస్తారా ?
చాలా తెలుగు సినిమాలు చూశాను. వెంకటేష్ గారు చేసిన ఫ్యామిలీ సబ్జెక్ట్ చూస్తుంటాను. ఆయన హిందీలో చేసిన అనారి సినిమా కూడా చూశాను.
 
మీరు వెంకటేష్ గారి నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు ?
ప్రతి నటుడిని నుంచి నేర్చుకోవాల్సినది చాలా వుంటుంది. వెంకటేష్ గారు చాలా కూల్ గా వుంటారు. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. లొకేషన్ కి వచ్చిన ముందే డైలాగ్స్ అన్నీ నేర్చుకొని వస్తారు. యాక్షన్ సీన్స్ లో చాలా రిస్క్ లు తీసుకున్నారు. ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ చేశారు. ఇందులో ఆయనది చాలా ఇంటెన్స్ క్యారెక్టర్. ఈ ప్రయాణంలో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.  ముఖ్యంగా ఆయనకి సహనం ఎక్కువ. అది ఆయన నుంచి తప్పకుండా నేర్చుకోవాలి.
 
దర్శకుడు శైలేష్ గురించి ?
శైలేష్ చాలా ప్రొఫిషనల్ డైరెక్టర్. తనకి చాలా క్లారిటీ వుంటుంది. ఎడిటింగ్ కూడా తన మైండ్ లో వుంటుంది. ఎంత షూట్ చేయాలనేది తనకు పూర్తి క్లారిటీ వుంటుంది. నా క్యారెక్టర్ ని చాలా ఇంప్రవైజ్ చేశాడు. అవకాశం వున్న ప్రతి చోట మెరుగుపరిచాడు. తను కథ చెప్పినప్పుడే ఇది తప్పకుండా పెద్ద విజయం సాధించే చిత్రం అవుతుందనే నమ్మకం కలిగింది. కథని ఎంత అద్భుతంగా చెప్పాడో అంతే అద్భుతంగా చిత్రాన్ని తీశాడు. తను చిత్ర పరిశ్రమలోకి వచ్చి కేవలం ఐదేళ్ళు అవుతుంది. కానీ చాలా అపూర్వమైన అనుభవం అతనిలో కనిపిస్తుంది. అన్ని విషయాలపై తనకి సంపూర్ణమైన స్పష్టత వుంటుంది.  
 
ఇందులో మీకు సవాల్ గా అనిపించిన అంశం ఏమిటి ?
హెవీ యాక్షన్ వున్న చిత్రమిది. యాక్షన్ సీక్వెన్స్ లు చేయడం కాస్త సవాల్ గా అనిపించింది. మీరు చూస్తున్నపుడు ఇందులో యాక్షన్ ఎంత కష్టమో అర్ధమౌతుంది.
 
ఇందులో మీకు మెమరబుల్ మూమెంట్ ?
శ్రీలంక షెడ్యూల్ మర్చిపోలేను. సముద్రంలో బోట్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నాం. బోట్ పై స్పీడ్ గా వెళుతున్నాను. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చింది. దీంతో ఒక్కసారి బోట్ వదిలేసి అలతో పాటు పైకి లేచాను. అదృష్టవశాత్తు.. మళ్ళీ బోట్ లోనే ల్యాండ్ అయ్యాను. (నవ్వుతూ) ఆ  సీన్ సినిమాలో వుంటుంది. ఆ సీక్వెన్స్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.
 
టాలీవుడ్, బాలీవుడ్ వర్కింగ్ స్టైల్ లో ఎలాంటి తేడా గమనించారు ?
టాలీవుడ్ చాలా ప్రొఫెషనల్ గా వుంది. ఇక్కడ సమయపాలన చక్కగా వుంది.
 
తెలుగు పరిశ్రమలో మీకు స్నేహితులు వున్నారా ?
నాని గారు, రానా గారితో కలసి మాట్లాడాను. వారితో కలసినప్పుడు నటన గురించి చాలా అంశాలని పంచుకున్నాం.