శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: గురువారం, 3 మే 2018 (15:56 IST)

సమంత పోటీకి భారీగా స్పందన.. ఇంత‌కీ ఆ పోటీ ఏంటి..?

అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా రూపొందుతోన్న చిత్రం మహానటి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో 'మాయా బజార్‌'లోని ‘అహ నా పెళ్లంట.. ఓహో నా పెళ్లంట’ పాటకు తమదైన శై

అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా రూపొందుతోన్న చిత్రం మహానటి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ  సినిమా ఈ నెల 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో 'మాయా బజార్‌'లోని ‘అహ నా పెళ్లంట.. ఓహో నా పెళ్లంట’ పాటకు తమదైన శైలిలో నృత్యం చేస్తే వారిలో బాగా అనిపించిన కొందరికి గిఫ్ట్‌లు ఇస్తానని హీరోయిన్‌ సమంత ఇటీవల ట్విట్టర్‌లో ప్రకటించింది.
 
వైజయంతి మూవీస్‌ వారి మహానటి ఫన్ ఛాలెంజ్‌ పేరిట మొదలైన ఈ పోటీకి మంచి స్పందన ల‌భిస్తోంది. చాలామంది అమ్మాయిలు ‘అహ నా పెళ్లంట.. ఓహో నా పెళ్లంట’ పాటకు డ్యాన్స్‌ చేస్తూ ఆ వీడియోలను తీసి #celebrateSavitri ట్యాగ్‌చేసి ట్విట్టర్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. వాటిల్లో కొందరు చిన్నారులు చేసిన డ్యాన్స్‌‌లు సమంతకి బాగా నచ్చాయి. వారి డ్యాన్స్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. లవ్లీ అంటూ కామెంట్ చేసి చప్పట్లు కొడుతున్న ఫోటోతో పోస్ట్ చేస్తుండ‌టం విశేషం.