మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srini
Last Modified: బుధవారం, 2 మే 2018 (11:58 IST)

క్యాస్టింగ్ కౌచ్ గురించి నాగ్ ఏమ‌న్నారో తెలుసా..?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను షేక్ చేసిన క్యాస్టింగ్ కౌచ్ గురించి సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రు స‌మ‌యం దొరికిన‌ప్పుడు స్పందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. ఇంత‌కీ నాగ్ ఎప్పుడు మాట్లాడారు..? ఎక్క‌డ మాట్లా

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను షేక్ చేసిన క్యాస్టింగ్ కౌచ్ గురించి సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రు స‌మ‌యం దొరికిన‌ప్పుడు స్పందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. ఇంత‌కీ నాగ్ ఎప్పుడు మాట్లాడారు..? ఎక్క‌డ మాట్లాడారు..? అనుకుంటున్నారా..? విష‌యం ఏమిటంటే... నాగ్ మ‌హాన‌టి ఆడియో ఆవిష్క‌ర‌ణ‌కు హాజ‌రై ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్ చేసారు. ఈ వేదికపై నాగ్ మాట్లాడుతూ... ఇన్‌డైరెక్ట్‌గా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడ‌డం విశేషం. 

ఈ సందర్భంగా వేదికపై నాగార్జున మాట్లాడుతూ... "ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, సావిత్రి పేర్లు తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటాయని అన్నారు. వారు లేకపోతే మాయాబజార్‌ లాంటి ఎన్నో అద్భుత సినిమాలు ఉండేవి కావని అన్నారు. మూగమనసులు, డాక్టర్‌ చక్రవర్తి, మిస్సమ్మ లాంటి ఎన్నో సినిమాలు తనకు చాలా ఇష్టమని అన్నారు. 
 
ఇంకో విషయమేంటంటే.. నాకు ఎనిమిది నెలల వయసులో సావిత్రి గారు నన్ను ఎత్తుకుని సినీ రంగానికి పరిచయం చేశారు.. 'వెలుగు నీడలు' సినిమాలో. దాంతో ఆమె స్టార్‌డమ్‌ నాకు కూడా కొద్దిగా వచ్చింది. ఒక వ్యక్తిపై బయోపిక్‌ తీయాలంటే ఆ వ్యక్తికి ఓ అర్హత ఉండాలి, ఆ అర్హత సావిత్రిగారికి ఉంది. ఇది తెలుగు సినీచరిత్రలో మొదటి బయోపిక్. 
 
ఒక స్త్రీకే ఆ అర్హత దక్కింది అన్నారు. ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీ గురించి మాట్లాడుతూ.... ఈ సినిమాని నిర్మించింది స్న‌ప్నాద‌త్, ప్రియాంక ద‌త్ అమ్మాయిలే. అలాగే ఈ సినిమాకి పనిచేసిన 20 మంది టెక్నిషియన్లు ఆడపిల్లలేనట.. ఈ ఆడియో వేదికను రూపొందించింది కూడా ఆడపిల్లలే అని తెలిసింది. తెలుగు సినీ పరిశ్రమలో ఆడపిల్లలకి అంతటి గౌరవం ఇస్తున్నాం అన్నారు. నాగ్ ఇలా మాట్లాడ‌టం క్యాస్టింగ్ కౌచ్ గురించే... అని ప్ర‌త్యేకించి చెప్పాలా..?  ఏది ఏమైనా క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం ఇండ‌స్ట్రీని షేక్ చేసింది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.