బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 31 మే 2024 (17:24 IST)

ఫోన్ ట్యాపింగ్ వల్లనే సమంత కాపురం కూలిపోయింది: బూర సంచలన వ్యాఖ్యలు

Samantha Ruth Prabhu
తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజకీయ నాయకులే కాదు ఆఖరికి సినిమా సెలబ్రిటీల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ పైన భువనగిరి బీజేపి ఎంపి అభ్యర్థి బూర నర్సయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ జంట నాగచైతన్య- సమంత విడాకులు తీసుకోవడం వెనుక వున్న కారణం కూడా ఫోన్ ట్యాపింగే అని అన్నారు.
 
అంతేకాదు మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేయించారనీ, ఆయన పైన పెద్ద ఫైలు కూడా సిద్ధమయ్యిందన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ఆ పెద్దాయన కనుసన్నల్లో జరిగిందని పరోక్షంగా కేసీఆర్ పైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఐతే... ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారి ఎవరూ అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వ పాలన సమయంలో వందలాది అధికారులు వుంటారనీ, వారిలో ఎవరైనా తప్పు చేసినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటారనీ, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని తేల్చేసారు.