1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. BRS moves ECI accusing Rahul Gandhi of levelling 'baseless' allegations in phone-tapping case

రాహుల్ గాంధీపై కేసు పెట్టిన బీఆర్ఎస్.. ఎందుకో తెలుసా?

rahul gandhi
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ ఇటీవల హైదరాబాద్ పర్యటనలో ఎన్నికల మార్గదర్శకాలను ఉల్లంఘించారని బీఆర్ఎస్ ఆరోపించింది. 
 
ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఎలాంటి ఆధారాలు చూపకుండా నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని, ముఖ్యంగా బీఆర్‌ఎస్ అధ్యక్షుడిపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీ, ఆయన పార్టీపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది.
 
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం, ఇతర పార్టీల విధానాలను మాత్రమే చర్చించాలని, ఒక వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించే ప్రకటనలు చేయడం మానుకోవాలని ఆదేశించింది. అయినప్పటికీ, రాహుల్ గాంధీ తన ప్రసంగంలో తప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉన్నారని బీఆర్ఎస్ పేర్కొంది.
 
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు గాను రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఆపాలని కూడా బీఆర్ఎస్ తన ఫిర్యాదులో ఈసీని కోరింది.
తర్వాతి కథనం
గత నెలలో అదృశ్యం.. క్లీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించిన హైదరాబాద్ విద్యార్థి