Samantha: నా కుక్క ప్రేమ కంటే ఏది గొప్పది కాదు: శోభితకు కౌంటర్ ఇచ్చిన సమంత
Samantha: టాలీవుడ్ హీరో నాగచైతన్యతో తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది శోభిత. మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం అని ట్యాగ్ చేస్తూ పెళ్లి ఫొటోస్ పంచుకుంది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత తన భర్త నాగచైతన్య గురించి పలు విశేషాలను మీడియాతో షేర్ చేసుకుంది శోభిత.
చైతన్యలాంటి వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమని పేర్కొంటూ ప్రేమ రహస్యాలు వెల్లడించింది. గతంలో సమంత కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం చూశాం. విడాకులకు ముందు జరిగిన పలు ఇంటర్వ్యూల్లో నాగ చైతన్య విషయంలో సమంత సరిగ్గా ఇలానే రియాక్ట్ అయింది.
ఈ నేపథ్యంలో కొందరు కావాలనే నాగచైతన్య శోభిత ధూళిపాళ పెళ్లి విషయంలో సమంతను ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇండైరెక్ట్‌గా ఆమెను ట్యాగ్ చేస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. ఇకపోతే ఇటీవల నాగచైతన్య, శోభితలు మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శోభిత మ్యారేజ్ పోస్టుకు సమంత స్పందించింది. కానీ డైరెక్ట్‌గా కాకుండా ఇన్ డైరెక్ట్‌గా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ని చేసింది. ఇంతకీ ఆ పోస్టులో ఏముంది అన్న విషయానికొస్తే.. తన కుక్కతో పాటు దిగిన ఫోటోని షేర్ చేసిన సమంత తన కుక్క ప్రేమ కంటే ఏది గొప్పది కాదు అని క్యాప్షన్ జోడించింది.
ఆ ఫోటోలో ఆమె చాలా బాధపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ శోభిత నాగచైతన్యలను ఉద్దేశించిన సమంత పోస్ట్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ బాధంతా తన తండ్రి మరణానికేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.