సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 10 జులై 2024 (20:30 IST)

బాహుబలిలో నటించిన సీనియర్ నటుడు సంపత్ రాజు మృతి

Sampath raju
Sampath raju
సీనియర్ స్టేజీ నటుడు, టీవీ నటుడు,  బాహుబలిలో మాహిస్మతి సామ్రాజ్యంలో మంత్రిగా  నటించిన  సంపత్ రాజు ఈరోజు మరణించారు.  ఈ రోజు నిమ్స్ లో అనారోగ్యంతో శివైక్యం చెందారని కుటుంబసభ్యులు తెలియజేశారు. ఆయన కథారచయిత కూడా. పలు టీవీ సీరియల్స్ లో నటించారు. బాహుబలి సినిమాలో చేశాక ఆయన సంతప్ రాజ్ యాక్టింగ్ స్కూల్ ను ఏర్పాటు చేసి కొంతమంది శిష్యులను తయారు చేశారు. భీమవరానికి చెందిన రాజు గారు పలు నాటకాలు వేశారు. 
 
ఆంధ్రప్రదేవ్ టీవీ, సినిమా నటీనటుల సంఘంలో సభ్యుడు ఆయన. చిత్రసీమకు వారు చేసిన సేవలు చిరస్మరణీయం. ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దిన మంచి గురువు గారు. వారి నటన ప్రతిభతో ఎన్నో సీరియల్స్ లో సినిమాల్లో ఎంతోమంది ప్రేక్షకులను అలరించారు. వారి ఆత్మకు సద్గతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అఫ్ తెలుగు టెలివిషన్ప్రె సిడెంట్ వినోద్ బాల,  జనరల్ సెక్రటరీ విజయ్ యాదవ్ ప్రకటనలో తెలియజేశారు.