సరిలేరు నీకెవ్వరు సినిమాకి ప్రారంభం రోజునే ఏ సినిమా ఇన్‌స్పిరేషనో తెలిసింది..!
సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదిలావుంటే.. ఈ మూవీ టైటిల్ లోగోని పరిశీలిస్తే ఓ విషయం స్పష్టమవుతోంది. టైటిల్ పక్కన తుపాకి, దానిపై ఉన్న సోల్జర్ క్యాప్ చూస్తుంటే.. ‘సరిలేరు నీకెవ్వరు’ మిలటరీ నేపథ్యం ఉన్న కథతో తెరకెక్కుతోందని అర్థమవుతోంది. దీనిని డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా కన్‌ఫర్మ్ చేసారు. ఈ లోగోని బట్టి సినిమా కథపై ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
అదేమిటంటే.. వెంకటేష్ ‘వారసుడొచ్చాడు’, మహేష్ ‘అతడు’ తరహాలో ఈ చిత్రకథ ఉంటుందట. అంటే.. ఒకరి స్థానంలోకి మరొకరు (కథానాయకుడు) వచ్చే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందట.
మిలటరీలో పనిచేసే మహేష్ తన స్నేహితుడి కోసం అనుకోని పరిస్థితుల మధ్య ఆ స్నేహితుడి గ్రామానికి రావడం, అక్కడ అతని కుటుంబానికి సాయపడటం వంటి అంశాలతో ఈ సినిమా ఉంటుందట.
ఈ కథాంశం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు మాత్రం చాలా హిలేరియస్‌గా ఉంటాయని టాక్. మహేష్ బాబు స్నేహితుడు తల్లి పాత్రలో విజయశాంతి కనిపిస్తుందని సమాచారం. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమా..? కాదా...? అనేది తెలియాలంటే 2020 సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.