శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 23 మే 2023 (10:30 IST)

రే స్టీవెన్సన్ మరణవార్త విని షాక్ అయ్యాను : ఎన్.టి. ఆర్.

Ray Stevenson
Ray Stevenson
రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రతినాయకుడిగా దేశప్రజలకు తెలిసిన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ నేడు మరణించారు. ఈ విషయం తెలియగానే ఆర్ఆర్ఆర్ షాక్ కు గురయ్యారు. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, రే స్టీవెన్సన్ మరణవార్త విని షాక్ అయ్యాను.  చాలా తక్కువ వయసులో పోవడం బాధాకరం. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవం. ఎన్నో విషయాలు మాట్లాడేవారు. అతని ఆత్మకు శాంతి కలుగుగాక అని తెలిపారు. 
 
రే స్టీవెన్సన్ థోర్ సినిమా సీరిస్‌తో పాప్యులర్ అయ్యారు. ఆయన మరణవార్తపై ఆర్ఆర్ఆర్ బృందం రాంచరణ్,  రాజమౌళి, కీరవాణి సంతాపం తెలిపారు. స్టీవెన్సన్ నార్త్ ఐర్లాండ్‌లో 1964 మే 25న జన్మించారు.