శ్రీదివ్య కూడా మేనేజ్ చేసింది!
నటి శ్రీదివ్య.. ఇప్పుడు తమిళంలో ఏకంగా మూడు సినిమాలు చేసింది. వారం రోజుల వ్యవధిలో పెన్సిల్, రాయుడు చిత్రాలు విడుదల కాబోతుండగా, మరో వారంలో మరో సినిమా విడుదల కాబోతుంది. అయితే.. శ్రీదివ్య.. విశాల్‌తో నటించాలంటే కొంచెం కష్టపడాల్సిందే.. ఆయన ఎత్తుకు వుండేలా.. తగు జాగ్రత్తలు తీసుకుని చేసినట్లు విశాల్ తెలియజేశారు.
కానీ శ్రీదివ్య కంటే కెమెరామెన్ ఎక్కువగా కష్టపడ్డాడు. కింద షాట్ నుంచి పైకి చూపించే విధానంలో.. కెమెరామెన్ బాగా కష్టపడ్డాని చెప్పాడు. తను సింగిల్ ఫ్రేంలో ఉన్నపుడు ఎలాంటి డైలాగ్ అయినా యాపిల్ మొబైల్‌ను ఎదురుగా పెట్టుకుని పూర్తిచేసేస్తానని, అయితే హీరోయిన్లతో కాంభినేషన్ సీన్లు ఉన్నప్పుడు మాత్రం కాస్త కష్టమవుతోందని విశాల్ పేర్కొన్నాడు.
ఇప్పటివరకు తనతో నటించిన హీరోయిన్లలో హైట్ విషయంలో పెద్దగా ఇబ్బంది లేని హీరోయిన్లు శృతిహాసన్, రీమాసేన్ అని చెప్పాడు. అయితే అందరూ తన ఎత్తు వుండేలా వుండాలనుకోవడం అత్యాశే అవుతుంది. కనుక నేను ఎత్తు విషయం పట్టించుకోను.. పెర్‌ఫార్మెన్స్ చూస్తానని చెబుతున్నాడు.