శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2020 (16:36 IST)

మాల్దీవుల్లో కైరా అద్వానీ.. ఎయిర్‌పోర్ట్‌లో దొరికిపోయింది..

అందాల భామ కైరా అద్వానీ తెలుగు, తమిళం, హిందీలో సినిమాలు చేస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. కైరా ఇప్పటికే పలుసార్లు బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కెమెరా కంటపడ్డది. దీంతో వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. 
 
కాగా కైరా అద్వానీ తన ప్రియుడు సిద్దార్ధ్ మల్హోత్రతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చింది. కొత్త ఏడాది వేడుకల కోసం మాల్దీవులకు వెళ్లారు. అక్కడ తన ప్రియుడు సిద్ధార్ధ్ మల్హోత్రతో కలిసి న్యూ ఇయర్ కు వెల్‌కమ్ చెప్పనున్నారు. 
 
కైరా-సిద్దార్థ్ మల్హోత్రా మాస్కులు పెట్టుకుని ముంబై ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమైన స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా, కియారా అద్వానీ ఇన్ని రోజులు తన ప్రియుడు ఎవరనేది సస్పెన్స్‌లో ఉంచింది. తాజాగా న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్దార్ధ్ మల్మోత్రతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాలకు చిక్కింది.