సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (13:27 IST)

గాయని చిత్రపై ట్రోలింగ్.. భక్తి భావంతో చేస్తే తప్పుబడతారా?

Chitra
Chitra
అయోధ్యలో జనవరి 22న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనుంది. ఆ రోజున ప్రతి ఒక్కరూ శ్రీరామ కీర్తనలు ఆలపించాలని.. తమ ఇళ్లల్లో ఐదు ప్రమిదలు వెలిగించాలంటూ.. ప్రముఖ సినీ నేపథ్య గాయని చిత్ర ఓ వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. 
 
చిత్ర విడుదల చేసిన ఆ వీడియో వివాదాస్పదమైంది. ఓ వర్గం వారు చిత్రను లక్ష్యంగా చేసుకుని, ఆమెకు రాజకీయాలు ఆపాదిస్తూ విరుచుకుపడుతున్నారు. గత రెండ్రోజులుగా చిత్రపై ట్రోలింగ్ కొనసాగుతూనే ఉంది. 
 
అయితే చిత్రకు కేరళ అధికార పక్షం సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ మద్దతుగా నిలిచాయి. సినీ గాయకులు, రచయితలు కూడా చిత్రకు సంఘీభావం ప్రకటించారు. 
 
రామ మందిరం ప్రాణ ప్రతిష్ట అనేది ప్రతిష్టాత్మకమని.. భక్తి భావంతో చిత్ర చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీలేదని కొందరు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఇంకా ఇంట ప్రమిదలతో దీపం వెలిగించడం శుభ ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.