'వెయ్యి అబద్దాల' హీరోయిన్‌ను పెళ్లాడనున్న సింగర్ నోయల్
ప్రముఖ బాలీవుడ్ సింగర్, నటుడు నోయల్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోనున్నాడు. నిజానికి నోయల్ తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అనేక సపోర్టింగ్ పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు కూడా. ఈయన ఓ హీరోయిన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తూ వచ్చాడు. ఆమెను త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు.
ఆ హీరోయిన్ ఎవరో ఎవరో కాదు ఎస్తర్ నోరోన్హ. తెలుగులో 'వెయ్యి అబద్దాలు' అనే చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత డాషింగ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'జయ జానకి నాయకి' చిత్రంలో నటించింది. తాజాగా 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' అనే చిత్రంలో నటించనుంది. గత 2012లో వెండితెరకు పరిచయమైన ఎస్తర్.. ఇప్పటివరకు 13 చిత్రాల్లో నటించింది.
అలాగే, హిందీ, మరాఠీ, తెలుగు, తమిళ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. రీసెంట్‌గా వీరిద్ధరు కొంకణి వర్షెన్‌లో డిస్పెకిటో అనే కవర్ సాంగ్ చేశారు. ఈ సాంగ్‌కి యూ ట్యూబ్‌లో రెండు లక్షలకి పైగా వ్యూస్ వచ్చాయి. వీరిద్దరి వివాహం త్వరలోనే జరుగనుంది.