బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 నవంబరు 2023 (16:39 IST)

విడుదల సిద్దమైన వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ ల సౌండ్ పార్టి

VJ Sunny, Hritika Srinivas
VJ Sunny, Hritika Srinivas
వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించిన చిత్రం `సౌండ్ పార్టీ`.  రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ.  సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం టీజ‌ర్, పాట‌లు  ఇప్ప‌టికే  విడుద‌లై టాలీవుడ్ లో గ‌ట్టిగానే సౌండ్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే సినిమాపై ప్రేక్షకుల్లో అంచ‌నాలు రేకెత్తించిన ఈ చిత్రం వ‌రల్డ్ వైడ్ గా  ఈనెల 24న గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.
 
ఈ సంద‌ర్భంగా వి పోలిశెట్టి మాట్లాడుతూ, టీజ‌ర్ లోని డైలాగ్స్ , వీజే స‌న్ని , శివ‌న్నారాయ‌ణ కెమిస్ట్రీ బాగా కుదిరిందంటున్నారు. ప్ర‌జంట్ ఆడియ‌న్స్ ఫ‌న్ అండ్  ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ చిత్రాల‌ను బాగా ఆద‌రిస్తున్నారు.. అదే త‌ర‌హాలో తెర‌కెక్కిన మా చిత్రాన్ని కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాం. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ నెల 24న గ్రాండ్ గా సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.
 
స‌మ‌ర్ప‌కుడు జ‌య శంక‌ర్ మాట్లాడుతూ...``పాట‌లు, టీజ‌ర్ సినిమాను ఇప్ప‌టికే ప‌బ్లిక్ లోకి తీసుకెళ్లాయి. సినిమా అంతా పూర్త‌యింది. ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరికి ఏ న‌మ్మ‌కంతో అయితే సినిమా ఇచ్చామో దాన్ని నిల‌బెట్టుకున్నాడు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులకు నచ్చే విధంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ తీశాడు. ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాం`` అన్నారు.
 
ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి మాట్లాడుతూ,  ఇటీవ‌ల సినిమా చూసి యూనిట్ అంతా హ్యాపీగా ఫీల‌య్యాం. మా చిత్రానికి ప‌ని చేసిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ఇచ్చిన స‌పోర్ట్ వ‌ల్లే ఒక మంచి సినిమా చేయ‌గ‌లిగా. ఇప్ప‌టికే టీజ‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నెల 24న వ‌స్తోన్న సినిమాకు కూడా అదే రెస్పాన్స్ వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు.