గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 మార్చి 2022 (19:21 IST)

రాజ్ కుమార్ హిరానీతో కలిసి పనిచేయాలి: జూనియర్ ఎన్టీఆర్

బాలీవుడ్‌లో ప్రసిద్ధ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ మున్నా భాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్, సంజు, పీకే వంటి సినిమాలతో హిట్ టాక్ సంపాదించుకున్నాడు. తాజాగా రాజ్ కుమార్ హిరానీతో కలిసి పనిచేయాలని.. ఆయన దర్శకత్వంలో నటించాలని టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. 
 
ఇటీవల విడుదలైన పాన్-ఇండియా మూవీ RRR బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో బద్ధలు కొడుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌ది ప్రతి నిర్మాతతో కలిసి పనిచేయాలని ఎదురుచూసే వ్యక్తిత్వం. బాలీవుడ్‌కి జూనియర్ ఎన్టీఆర్ పెద్ద అభిమాని. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "నేను సరైన హిందీ చిత్రంలో పనిచేయడానికి ఇష్టపడతాను. నాకు రాజ్‌కుమార్ హిరానీ చిత్రాలంటే ఇష్టం. ఇంకా  సంజయ్ లీలా బన్సాలీ సినిమాలు కూడా ఇష్టం" అంటూ చెప్పుకొచ్చాడు.