సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (10:57 IST)

నువ్వు లక్ష సార్లు మల్లెపూలు పిసికావు... మరిచిపోయావా...? మాధవీలతపై శ్రీరెడ్డి ఫైర్

నటి, బీజేపీ మహిళానేత మాధవీలత సాధినేని యామినిని ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్టు చేసింది. పార్టీని తిట్టిన వారికే పదవులు ఇస్తారని... పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు లేదని మాధవీలత పోస్ట్ చేసింది.

ఈ వ్యవహారంపై సాధినేని యామిని ఇప్పటివరకు స్పందించలేదు. సాధినేని యామినికి బీజేపీ అధికార ప్రతినిధి పోస్ట్ దక్కడంతో మాధవీలత ఆమెపై ఓ రేంజ్‌లో విరుచుకుపడింది. అయితే మాధవీలతపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఫైర్ అయ్యింది. 
 
ఇంకా మాధవీలతకు షాక్ ఇచ్చింది. ''సాధినేని యామిని జోలికి వస్తే తాట తీస్తా.. నీ బండారం బయటపెడతా" అంటూ ఫేస్‌బుక్‌లో శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. తాను సాధినేని యామినికే సపోర్ట్ చేస్తానని... ఆమె గురించి ఎవరైనా పిచ్చవాగుడు వాగితే తాట తీస్తా.. వారి చరిత్ర అంతా బయటకు తీస్తా అంటూ పోస్ట్ చేసింది. మీకులం వాళ్లకు ప్రేమ లేఖలు, మిగతావాళ్లను చూస్తూ ఏడుపు అంటూ శ్రీరెడ్డి కులం ప్రస్తావన తీసుకొచ్చింది. 
Srireddy
 
అంతేగాకుండా.. ''నువ్వు లక్ష సార్లు మల్లెపూలు పిసికావు... మరిచిపోయావా...?" అంటూ పోస్ట్ చేసింది. గతంలో క్యాస్టింగ్ కౌచ్ విషయంలో మాధవీలత శ్రీరెడ్డిపై కామెంట్స్ చేయడంతో... శ్రీరెడ్డి సాధినేని యామినికి సపోర్ట్ ఇస్తూ మాధవీలతను టార్గెట్ చేసింది. శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ గురించి మాధవీలత ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మాధవీలత చేసిన పోస్ట్ పై బీజేపీ నేతలు కూడా సీరియస్ అయ్యారని తెలుస్తోంది.