శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (21:30 IST)

యామినిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవీలత..?

మాధవీలత పెద్దగా సినిమాలు చేయకపోయినా తెలుగు సినీపరిశ్రమలో మంచి పేరే ఉంది. అడపాదడపా సినిమాలు చేసినా పెద్ద అవకాశాలు మాత్రం ఆమెను వరించలేదు. కానీ టివీ షోలలో మాత్రం మాధవీలత బాగా ఫేమస్. ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌కు అండగా నిలబడి ఆయన్ను విమర్సించే వారిని ఎక్కుపెట్టింది. 
 
తన పదునైన మాటలతో పవన్‌ను విమర్సించే వారికి సమాధానాలు చెప్పింది. అయితే ఆమెకు సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ఇక నేరుగా రాజకీయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. మాధవీలత బిజెపిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
 
బిజెపి తరపున గత ఎన్నికల్లో మాధవీలత పోటీ కూడా చేసింది. అయితే ఓడిపోయింది. అయినా సరే అదే పార్టీలో ప్రస్తుతం కొనసాగుతోంది. కానీ ఈమధ్య కాలంలో యామిని బిజెపితో చేరారు. దీంతో ఆమెకు పార్టీలో కీలక బాధ్యత అప్పజెప్పారు.
 
దీంతో మాధవీలతకు చిర్రెత్తుకొచ్చింది. పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం. మాకు పదవులు లేవు. కానీ మల్లెపూల వాసన సువాసన గురించి మాట్లాడిన యామినికి మాత్రం మీరు పదవులు ఇస్తారా అంటూ సొంత పార్టీ నేతలపైనే విమర్సలు చేసింది మాధవీలత. దీంతో ఒక్కసారిగా ఆ పార్టీలో చర్చకు దారితీస్తోంది. కానీ మాధవీలత విమర్సలపై సాధినేనియామిని మాత్రం స్పందించలేదు.