మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 3 జనవరి 2020 (18:40 IST)

అవకాశం కోసం పడుకోవాలా, పడుకున్న హీరోయిన్ల పేర్లు నాకు తెలుసు, ఎవరు?

తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గుంజన్ ఎవరో తెలియక ఆశ్చర్యపోతున్నారు కదూ. వైఫే అనే సినిమాలో నటించిందామె. ఆ సినిమా అక్కడక్కడ రిలీజైంది కాబట్టి అందరికీ గుంజన్ అంటే తెలియదు. కానీ గుంజన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది. అగ్రహీరోయిన్ల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
 
నాకు అందం ఉంది. నా అందాన్ని నేను చూపిస్తాను. బికీనీలు, కిస్‌లు పెట్టడం మామూలే. ఇందులో హీరోయిన్‌గా ఫీలవ్వాల్సిన అవసరం ఎందరికీ ఉండదు. నేను కూడా అలాగే అనుకుంటాను. ఇక మిగిలిన వాటిని గురించి చెప్పమంటారా.. నాకు అందం ఉంది. అవకాశమిస్తే నటిస్తాను. అంతమాత్రాన అవకాశం రాలేదని దర్సకుడు, నిర్మాతలతో నేను కమిట్ అవ్వను.
 
చాలామంది హీరోయిన్లు ఉన్నారు. ప్రస్తుతం అగ్రహీరోయిన్లుగా ఉన్నవారూ ఉన్నారు. అందులో 90 శాతం మందికి పైగా కమిట్మెంట్‌లతో పైకి వచ్చిన వారు ఉన్నారు. వారి పేర్లు నాకు తెలుసు. కానీ నేను చెప్పను. ఇదంతా సినీ పరిశ్రమలో మామూలే. కానీ ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి కదా. నాకు అందం ఉంది.. కానీ అవకాశాలు లేవు. అయినంత మాత్రాన బాధపడను. ఎవరికీ లొంగిపోను అంటోంది ఈ భామ. ప్రస్తుతమైతే తన సొంత టాలెంట్‌తో ఒక తెలుగు, ఒక తమిళ సినిమాలో నటిస్తున్నట్లు చెబుతోంది.