శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (16:33 IST)

ఆకలి కంటే.. దాని కోసమే పరితపిస్తున్నారు.. శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

శ్రీరెడ్డి అంటే తెలియని వారుండరు. దగ్గుబాటి అభిరామ్‌ తనను మోసం చేశాడని మీడియాకెక్కడం, మధ్యలో పవన్ కళ్యాణ్‌ను దూషించడం, నానిపై అసభ్యకర కామెంట్స్ చేయడం లాంటివెన్నో చేసింది. అనంతరం చెన్నై వెళ్లి సెటిలైపోయింది. అయినా శ్రీరెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిల వ్యవహారంతో మళ్లీ శ్రీ రెడ్డి వార్తల్లొ నిలిచింది
 
ప్రపంచమంతా కరోనా వైరస్‌కు గజగజ వణికిపోతూ ఉంటే.. శ్రీ రెడ్డి మాత్రం దాన్ని కూడా వదలట్లేదు. పిచ్చి పిచ్చి కామెంట్లతో సెటైర్స్ వేస్తూ హల్చల్ చేస్తోంది. ప్రధాని పొడిగించిన లాక్ డౌన్‌పై, మోడీ నిర్ణయాలపైనా రీసెంట్‌గా కౌంటర్స్ వేసింది. పేదవారి ఆకలిని తీర్చండని సలహాలు ఇచ్చింది.
 
తాజాగా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీనిపై శ్రీరెడ్డి బోల్డ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం జనాలంతా.. ఆకలి కంటే.. సెక్స్ కోసమే పరితపిస్తున్నారు.. మీ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్‌కు రిప్ అంటూ ఓ కొంటె పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీరెడ్డి కామెంట్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది.