సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (15:33 IST)

శ్రీజ మూడో పెళ్లి... పవన్ వల్ల అన్నయ్య ఓకే చెప్పారా?

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ మూడో పెళ్లి వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీజ మూడో పెళ్లి గురించి వార్తలు వస్తున్నా మెగా కుటుంబం మాత్రం ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. ఇకపోతే ఈ వార్తల గురించి పలువురు నిర్మాతలు స్పందిస్తూ శ్రీజ గురించి వస్తున్న వార్తలను ఖండించారు.  
 
తాజాగా ఈమె మూడో పెళ్లికి సంబంధించిన మరొక వార్త వైరల్ అవుతుంది. చిరంజీవికి తన కూతురికి మూడో వివాహం చేయడం ఏమాత్రం ఇష్టం లేదని కాకపోతే ఒకరి ప్రమేయం వల్ల చిరంజీవి తన కూతురికి మూడో పెళ్లి చేయడానికి సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. 
 
శ్రీజ బాబాయ్ పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి చిరంజీవితో మాట్లాడి పాప ఆనందం కన్నా మనకి ఏది ముఖ్యం కాదంటూ చిరంజీవిని మూడవ పెళ్ళికి ఒప్పించారనే వార్తలు వస్తున్నాయి. 
 
పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి తన అన్నయ్యకు నచ్చచెప్పడంతోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఈ విధంగా శ్రీజ మూడవ పెళ్లికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ మెగా కుటుంబం మాత్రం తరచూ వార్తల్లో నిలవడం గమనార్హం.