గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (14:01 IST)

మా పెళ్లిలో బాగా డ్రింక్స్ చేశాం.. అందుకే ఫోటోలు తీయించలేదు..

radhika apte
లైఫ్ హో తో ఐసే అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రాధికా ఆప్టే. 2012లో లండన్‌‌కు చెందిన మ్యూజీషియన్ బెనడిక్ట్ టేలర్‌‌ను పెళ్లి చేసుకుంది రాధికా ఆప్టే. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 
 
ఆ సమయంలో ఎవరూ ఈ విషయాన్ని నమ్మలేదు. దానికి కారణం ఏంటో ఆమెని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. పెళ్లి సమయంలో ఫొటోలు తీసుకోలేదని చెప్పింది రాధికా. ఆమె మాట్లాడుతూ.. 'నేను, బెనడిక్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు ఫొటోలు తీసుకోలేదు.
 
మా పెళ్లికి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. భోజనాలు చేశాం. వచ్చిన స్నేహితుల్లో చాలా మంది ఫొటోగ్రాపర్స్ ఉన్నప్పటికీ ఎవరూ ఫొటోలు తీయించుకోలేదు. అందుకు కారణం మేం పెళ్లిలో బాగా డ్రింక్ చేశాం. 
 
అందుకనే పెళ్లి రోజున నా భర్త ఫొటోలు తీయించలేదు. అందువల్లనే పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు' అని చెప్పుకొచ్చింది.