రామ్ పోతినేని, బోయపాటి శ్రీను చిత్రంలో శ్రీలీల ఎంట్రీ
మాసీవ్ బ్లాక్బస్టర్ 'అఖండ' చిత్రాన్ని అందించిన బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ #బోయపాటిరాపో ని డైరెక్ట్ చేస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై ఉన్న అంచనాలను అందుకునేలా బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హీరో రామ్ కి జోడిగా టాలీవుడ్ మోస్ట్ హ్యపనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రం అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈరోజు చిత్ర షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయ్యింది. దర్శకుడు బోయపాటి, రామ్ శ్రీలీలకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది.
బోయపాటి శ్రీను, రామ్ ని మాస్ క్యారెక్టర్ లో చూపించనున్నారు. ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.