బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (17:26 IST)

నేను బి.సినే. ఉప్పర సోది అన్నందుకు క్షమాపణ : దర్శకుడు త్రినాథ్‌

Trinadha rao
Trinadha rao
ఉప్పర సోది అనే పదం వాడి మా కులాన్ని కించపరిచారనీ, మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఉప్పర కులస్తులు నిన్న హైదరాబాద్‌ ఫిలింఛాంబర్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ఆ రోడ్డంతా గంటకుపైగా బ్లాక్‌ అయింది. దీనిపై గురువారంనాడు రవితేజ నటించిన థమాకా దర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన వివరణ ఇచ్చారు.
 
ఉప్పల సోది అనేది కామన్‌ పదం అయింది. వాంటెడ్‌గా అనకపోయినా అలా వస్తుంది. కనుక దాన్ని కటాఫ్‌ చేయాలి అని ఉప్పర సంఘం నాయకుడు ఓ మంచి మాట అన్నాడు. అందుకే నేను చెప్పేదొకటే. ఆ పదం వాడడం వల్ల ఉప్పర సోదరులకు కష్టం కలుగుతుందని గ్రహించాను కాబట్టి. ఉప్పర సోది అనే పదం సినిమావాళ్ళేకాదు, రాజకీయనాయకులు, బిజిసెన్‌మేన్‌ వారుకూడా ఈ పదాన్ని బహిష్కరిద్దాం.
 
ఉప్పర సోదరులారా, రేపు విడుదలకాబోతున్న థమాకా సినిమాను చూసి ఆశీర్వదించండి అని తెలుపుతూ, వారికి క్షమాపణలు తెలియజేస్తున్నాను అన్నారు.