సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (21:48 IST)

ఓజీ కోసం కలరిపయట్టును ప్రాక్టీస్ చేస్తోన్న శ్రీయా రెడ్డి

OG
OG
"సలార్" ఫేమ్ నటి శ్రీయా రెడ్డి తన తదుపరి రోల్ కోసం కసరత్తు చేస్తోంది. సలార్ తర్వాత మంచి పేరు కొట్టేసిన శ్రీయా రెడ్డికి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా ఓజీ కోసం కలరిపయట్టును శ్రీయా రెడ్డి ప్రాక్టీస్ చేస్తోంది. 
 
ఆమె తన తదుపరి తెలుగు గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ఓజీ' కోసం శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలలో నటించారు.
 
శ్రీయ తన అద్భుతమైన శారీరక బలం, చురుకుదనాన్ని ప్రదర్శిస్తూ కఠినంగా శిక్షణ తీసుకుంటోంది. ఓజీలో తన పాత్ర గురించి శ్రేయా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇకపోతే.. ఓజీకి సుజీత్ రచన, దర్శకత్వం వహించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు.