మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (12:09 IST)

"ట్రిపుల్ ఆర్" నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్

ట్రిపుల్ ఆర్ (ఆర్ఆర్ఆర్)నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్. ఈ చిత్రంలో నటిస్తున్న హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు బుల్లెట్‌పై వెళ్తున్న పిక్ ఒకటి తాజాగా రిలీజైంది. ఇది ప్రతి ఒక్కరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. 
 
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమాగా నిర్మితమవుతుంది. ఇటీవల హైదరాబాద్ సారధి స్టూడియోస్‌లో తిరిగి చిత్రీకరణ పారంభమైంది. ముందుగా సెట్​లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ జాయిన్ కాగా ఆ తర్వాత కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ జాయిన్ అయ్యాడు. 
 
ఈ సెట్‌లో ఉన్న చరణ్ పిక్స్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చి వైరల్ అవుతునాయి. చరణ్ లుక్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ప్రస్తుతం రామ్​చరణ్ -​ ఎన్టీఆర్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌నే వీరిద్దరిపై ఓ పాట కూడా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. 
 
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకమపై డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
 
ఇపుడు తాజాగా, బుల్లెట్ బైక్‌ను జూనియర్ ఎన్టీఆర్ డ్రైవ్ చేస్తుంటే వెనుక రామ్ చరణ్ కూర్చొనివున్నారు. వీరిద్దరూ రోడ్లపై చక్కర్లు కొడుతున్నట్టుగా ఉండే ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.