శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (22:32 IST)

ఏ క‌థ‌లో అయినా ఆ క్యారెక్టర్ బలంగా ఉంటేనే స‌క్సెస్ః అజయ్ భూపతి

Ajay Bhupathi
`మహాసముద్రం` సినిమా పూర్తిగా కల్పిత కథ. ఓ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథ, ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే కథ. కొన్ని పాత్రల మధ్య జరిగే కథ. వైజాగ్‌లో సముద్రానికి ఆనుకుని ఉన్న లొకేషన్లో సాగే కథ. అక్కడి వ్యక్తులు, వారి వ్యక్తిత్వాల మధ్య జరిగే కథ` అని చిత్ర ద‌ర్శ‌కుడు అజయ్ భూపతి తెలియ‌జేశారు.
 
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా ఈనెల 14న విడుద‌ల‌కాబోతుంది.  ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టించారు. దసరా కానుకగా అక్టోబర్ రాబోతోన్న ఈ సినిమా గురించి దర్శకుడు అజయ్ భూపతి ప‌లు విష‌యాలు తెలియ‌జేశాడు.
 
- ఈ సినిమాలో మహా పాత్రకు కొంత మందిసెట్ అవుతారు. సమంత గారికి కూడా ఈ కథ బాగా నచ్చింది. ముందు ఆమెను కూడా అనుకున్నాను. కానీ చివరకు అదితిరావు హైదరిని తీసుకున్నాను.
 
- ఏ స్టోరీలో అయినా సరే ఫీమేల్ క్యారెక్టర్ బలంగా ఉంటే అది సక్సెస్ అవుతుందని నా ప్రగాఢ నమ్మకం. బాలచందర్ గారి చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. అంతులేని కథలో జయప్రద పాత్ర ఇష్టం. సినిమాలో అలా వచ్చి వెళ్లే క్యారెక్టర్లను నేను రాయను.
 
- ఇద్దరు హీరోలతో సినిమా అంటే వచ్చే కిక్ వేరు. ఇద్దరు హీరోలున్న దళపతి, విక్రమ్ వేదా ఇలా ఎన్నో సినిమాలు తెరపై చూస్తే ఏదో తెలియని ఆనందం వేస్తుంది. అలాంటి ఫీల్‌ను ప్రేక్షకులకు ఇవ్వాలని, ఆ కిక్‌ను వారికి మళ్లీ చూపించాలనే సినిమాను తీశాను.
 
కథ రాసుకున్నప్పుడు ఎవ్వరినీ ఊహించుకోలేదు. ఇద్దరు హీరోలు అని కథ రాసుకున్నా. కొంత మంది దగ్గరికి వెళ్లాను. కథ బాగా నచ్చిందని అందరూ అన్నారు. కానీ కొంత మంది సోలో హీరో అయితే చేస్తాను అని అన్నారు. కానీ నేను ఇదే కథ చేస్తాను అని పట్టుబట్టాను. అలా చివరకు శర్వా, సిద్దులు ఓకే అయ్యారు
 
- ఫ్రెండ్ అంటే నాలుగు రోజులు కలిసి తిరిగి, బీర్లు తాగివెళ్లడం కాదు. ఒక్కసారి మనం ఫ్రెండ్ అని అనుకుంటే.. వాడు చేసే తప్పులను, ఒప్పులను అంగీకరించాలి. జీవితాంతం వాడి కోసం నిలబడాలని చెప్పే కథ.
 
- నాకు ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అయిందో తెలియదు. నిర్మాతలు కూడా నాకు ఎప్పుడూ ఇంత బడ్జెట్ అయిందని చెప్పలేదు. ఈ సినిమాను నా మీద వదిలేశారు. నాకు ఏ సమస్యను రానివ్వలేదు. కొత్త ఆర్టిస్ట్‌ల్లా నా దగ్గరికి వచ్చే వారు. సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి కారణం నిర్మాతలే. నాలుగు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేశాను. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనా కూడా వైజాగ్‌లో జాగ్రత్తగా షూటింగ్ చేసుకుని వచ్చాం.
 
- ఆర్ ఎక్స్ 100 సమయంలోనూ రెండు ట్రైలర్లు కట్ చేశాను. ఇప్పుడు కూడా అలానే చేశాను. అది నా స్టైల్. కథలో దమ్ము ఉండాలి. కావాలంటే నేను ఇంకో ట్రైలర్‌ను కూడా కట్ చేయగలను. ట్రైలర్ చూసి ఈ కథను చెప్పలేరు. ఇందులో సబ్ స్టోరీస్ చాలా ఉంటాయి.
ప్రేమకు హద్దుల్లేవు. నీ మీద నీకు ఎంత ప్రేమ అని అంటే.. అంత ఇంత అని చెప్పలేం. దాన్ని కొలవలేం. ఒక్కోసారి ప్రేమించిన వారి కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. అందుకే కొలవలేనంత ప్రేమ అనే క్యాప్షన్‌ను పెట్టాం.
 
- నేను చూసిన కొంతమంది క్యారెక్టర్స్, వారి క్యారెక్టరైజేషన్స్ ఈ చిత్రంలో వాడాను. అలా మా అమ్మమ్మ గారు తన చేతిని కొరుక్కునేది. పిల్లల అల్లరిని తట్టుకోలేక అలా చేసివారు. అదే రావు రమేష్ గారికి పెట్టాం. జగపతి బాబు గారి పాత్రను మన చుట్టూ చూస్తుంటాం. ఆయనే ఈ సినిమా క్యారెక్టర్స్ అతి పెద్ద బలంగా మారుతాయి. సినిమా చూసి బయటకు వచ్చాక హీరో హీరోయిన్లు గుర్తుకు ఉండరు. క్యారెక్టర్సే గుర్తుంటాయి.
 
- ఎప్పుడూ విలన్ క్యారెక్టర్లు వేసే వారిని తీసుకొచ్చి విలన్‌గా చూపిస్తే ఏం బాగుంటుంది. అందుకే ఎప్పుడూ లవర్ బాయ్ క్యారెక్టర్లు వేసిన సిద్దును ఇందులో మాస్ యాంగిల్‌లో చూపించాను. అదే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. నేను క్యారెక్టర్ ఇలా ఉండాలని చెప్పాను. కానీ మేకోవర్ కోసం ఆయనే కష్టపడ్డారు. సిద్దు మేకప్ మేన్ చాలా రకాలుగా ట్రై చేశారు. 
 
- ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు శర్వా క్యారెక్టర్ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సినిమా చూసి బయటకు వచ్చాక శర్వా పాత్రను మీరంతా ప్రేమిస్తారు. 
 
- మ్యూజిక్ డైరెక్టర్ చైతుకి నా మెంటాలిటీ తెలుసు. నాకు ఏ టైప్, కొత్త జానర్‌లు అంటే ఇష్టమని తెలుసు. రంభ రంభ, చెప్పకే చెప్పకే పాటలు ఇప్పటికే సక్సెస్ అయ్యాయి. ఇక సినిమాలో విజువల్స్ చూస్తే అందరికీ నచ్చుతాయి. ఈ సినిమాకు ఆయనే మెయిన్ పిల్లర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడు. కొత్త సౌండ్స్ వింటారు. నా బాస్ (ఆర్జీవీ) దగ్గర నేర్చుకుందే సౌండ్ గురించి. ఆ విషయంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను.
 
- ఆర్ ఎక్స్ 100 సినిమా పాన్ ఇండియా. ఇప్పుడు అన్ని భాషల్లో రీమేక్ అవుతోంది. అంటే ఆర్ ఎక్స్ 100 ఐడియా పాన్ ఇండియా. ఇప్పుడు మహా సముద్రం కూడా పాన్ ఇండియా సినిమానే. ఆ దిశగా చర్చలు కూడా జరుగుతున్నాయి.
 
- ఆర్ ఎక్స్ 100 బాలీవుడ్ రీమేక్ కోసం ఆఫర్ వచ్చింది. బాలీవుడ్‌లో చేయాలనే ఆసక్తి నాకు లేదు. నాకు ఇక్కడ చాలా బాగుంది. అక్కడి కంటే ఇక్కడే బాగుంది. తెలియని వాళ్ల దగ్గరకి వెళ్లి సినిమా చేయాలని ఇప్పుడు అనిపించలేదు. భవిష్యత్తు గురించి ఇప్పుడే ఏం చెప్పలేను.
 
- ఓటీటీలో కూడా ఆఫర్లు వస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్‌లో ఆంథాలజీ కాన్సెప్ట్ కోసం అడిగారు. ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఓటీటీలో అయితే మన ఐడియాను ఇంకాస్త విస్తృతంగా చూపించవచ్చు. థియేటర్లో చూపించలేని ఐడియాను, ఆ స్పాన్‌ను ఓటీటీ కోసం ఇంకాస్త పెంచుకోవచ్చు. నాకు కూడా ఓటీటీ అంటే ఇష్టం.
- అన్ని జానర్లలో చిత్రాలు చేయాలని ఉంది. మహా సముద్రం తరువాత మాస్ ఎంటర్టైనర్‌తో రాబోతోన్నాను.  స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. హీరో ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు. చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని వివరాలు ప్రకటిస్తాను.
 
- దర్శకుడు కావాలన్నదే నా కల. మొదటి చిత్రంతోనే ఆ కల నెరవేరింది. ఆ సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అని కూడా ఆలోచించలేదు. నేను దర్శకుడని అయ్యాను అనే తప్పా.. సినిమా ఫలితం గురించి నేను ఆలోచించలేదు. నాకు పలాన సినిమా చేయాలి అనే కల ఏమీ లేదు. నచ్చిన చిత్రాలు చేసుకుంటూ వెళ్తాను.
 
- మామూలుగా మనం మాట్లాడుకునే విధంగానే డైలాగ్స్ ఉంటాయి. కానీ కొన్ని మాత్రం ఫిలాసిఫికల్‌గా ఉంటాయి. డైలాగ్స్ సయ్యద్ రాశాడు. మన జీవితం మనకు నచ్చినట్టుగా ఉండాలంటే దేవుడు మందు కొట్టి రాసి ఉండాలి.. అనేది ఫిలాసిఫికల్ డైలాగ్. మహజ్జాతకుడు,ఏం అనుకుంటే అది జరిగిపోతుంది అని దేవుడు సృష్టించాడేమో అనేది ఆ డైలాగ్ అర్థం. సినిమాలో డైలాగ్స్ అదిరిపోతాయి. సన్నివేశాలకు తగ్గట్టుగా కొన్ని డైలాగ్స్ వస్తాయి.. అవి మహాద్బుతంగా ఉంటాయి.