మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (09:06 IST)

ఆ తండ్రి ఎక్కుడున్నాడో కనుక్కోండి.. నేను చావగొడతా: సుధీర్ బాబు

బెంగళూరులో హోమ్ వర్క్ విషయంలో అబద్ధం చెప్పాడని కన్నకుమారుడిని చితకబాదిన ఓ తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఘాటుగా స్పందించాడు.

బెంగళూరులో హోమ్ వర్క్ విషయంలో అబద్ధం చెప్పాడని కన్నకుమారుడిని చితకబాదిన ఓ తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఘాటుగా స్పందించాడు. 
 
చిన్నారి హోమ్ వర్క్ విషయంలో అబద్ధం చెప్తే.. ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నించాడు. అతడు ఎక్కడుంటాడో చెప్తే... తాను అతడిని అంతకంటే ఎక్కువే చావగొడతానని సుధీర్ బాబు అన్నారు. అతడిని తండ్రిగా పిలవడానికి సిగ్గేస్తుందని.. దయచేసి ఆ కిరాతక తండ్రి చిరునామా ఏంటో కనుక్కోండి అంటూ అడిగాడు. 
 
కాగా అవాస్తవాలు చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో 30 ఏళ్ల వ్యక్తి తన పదేళ్ల కుమారుడిగా దారుణంగా కొట్టాడు. ఈ తతంగాన్నంతా అతని భార్య వీడియో తీసిన సంగతి తెలిసిందే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.