సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: గురువారం, 31 మే 2018 (18:48 IST)

బయోపిక్ గురించి సుధీర్ బాబు అడిగితే కృష్ణ ఏమ‌న్నారో తెలుసా?

ప్ర‌స్తుతం బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. సావిత్రి బ‌యోపిక్ వ‌చ్చింది. ఎన్టీఆర్ బ‌యోపిక్ త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఎ.ఎన్.ఆర్ బ‌యోపిక్ గురించి ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ... లేద‌నే విష‌యాన్ని నాగార్జున స్ప‌ష్టం చేసారు. ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ త‌ర్వ

ప్ర‌స్తుతం బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. సావిత్రి బ‌యోపిక్ వ‌చ్చింది. ఎన్టీఆర్ బ‌యోపిక్ త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఎ.ఎన్.ఆర్ బ‌యోపిక్ గురించి ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ... లేద‌నే విష‌యాన్ని నాగార్జున స్ప‌ష్టం చేసారు. ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ త‌ర్వాత చెప్పుకోవ‌ల‌సింది సూప‌ర్ స్టార్ కృష్ణ‌ గురించే. ఒక వైపు హీరోగానూ .. మరోవైపు నిర్మాతగాను ఆయన ప్రయోగాలు.. సాహసాలు చేశారు. తెలుగు సినిమాకి భారీతనం తెచ్చిన నిర్మాతలలో ముందుగా కృష్ణ పేరు కనిపిస్తుంది. 
 
ఈ రోజు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా 'సమ్మోహనం' సినిమా టీమ్ కృష్ణని కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేసింది. సమ్మోహనం అనే టైటిల్ పెట్టడం పట్ల ఆయన ఈ సినిమా టీమ్‌ను అభినందించారు. 'సమ్మోహనం' రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుసుకున్న ఆయన, తన సినిమాల్లో 'పండంటి కాపురం'లో రొమాంటిక్ అంశాలు ఎక్కువగా కనిపిస్తాయని అన్నారు. ఆ సినిమా 37 సెంటర్లలో 100 రోజులు ఆడిన విషయాన్ని గుర్తు చేశారు. 
 
ఇక కొత్తగా బయోపిక్‌ల సందడి పెరుగుతోన్న విషయాన్ని సుధీర్ బాబు ప్ర‌స్తావిస్తూ... మీ బయోపిక్‌లో హీరోగా ఎవరు చేస్తే బాగుంటుంది? ఎవరు దర్శకత్వం వహిస్తే బాగుంటుంది? అని అడిగారు. ఎప్పుడో తీయబోయే సినిమా గురించి ఇప్పుడే ఎలా చెప్పగలను? అంటూ కృష్ణ నవ్వేశారు. మ‌రి... కృష్ణ బ‌యోపిక్ తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తారేమో చూడాలి.