శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2024 (13:55 IST)

పిల్లలు, పెద్దలు మెచ్చే సినిమా బాక్ : కుష్బూ

Bak team
Bak team
'అరణ్మనై' సిరిస్ లో వచ్చే సినిమా చూడటానికి చిన్న పిల్లలని పట్టుకొని మహిళలూ థియేటర్స్ రావడం జరుగుతుంది.  ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకొచ్చే సినిమాల్లో బాక్ మరో అడుగుముందుకు వేస్తోంది. మరో సూపర్ డూపర్ హిట్ ఇస్తున్న మా దర్శకుడు సుందర్ గారికి థాంక్స్ అని 'బాక్' మూవీ నిర్మాత కుష్బూ అన్నారు. 
 
 సుందర్ సి, తమన్నా భాటియా, రాశీ ఖన్నా నటించిన 'అరణ్మనై 4' మే 3న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో బాక్ అనే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు.  ఖుష్బు సుందర్,  ACS అరుణ్ కుమార్‌లు Avni Cinemax P Ltd పతాకంపై నిర్మించారు. గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో మేకర్స్ బాక్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
 
రాశి ఖన్నా మాట్లాడుతూ.. డైరెక్టర్ సుందర్ సి గారు ఈ సినిమాకి బ్యాక్ బోన్. ఆయన చాలా క్లియర్ విజన్ తో సినిమా చేశారు. నాకు హారర్ సినిమాలు చాలా ఇష్టం. కానీ అవి తీయడం ఎంత కష్టమో  'అరణ్మనై' 3 సమయంలో అర్ధమైయింది. చాలా అద్భుతమైన టెక్నికల్ టీంతో ఈ సినిమా చేశాం. మ్యూజిక్ వండర్ ఫుల్ గా వుంటుంది. ఈసారి 'బాక్' కి గ్లామర్ పెరిగింది. తమన్నా ఇప్పటివరకూ చేయని ఓ కొత్త పాత్రలో ఇందులో కనిపించబోతున్నారు. ఇప్పటికే పాట వైరల్ అవుతుంది. సుందర్ గారికి ఆడియన్స్ పల్స్ తెలుసు. ఇందులో హారర్ గ్లామర్ థ్రిల్ కామెడీ అన్నీ వున్నాయి. కోవై సరళ గారితో వర్క్ చేయడం మంచి ఎక్స్ పీరోయన్స్. ఆమె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఖుష్బు గారు సుందర్ గారికి బ్యాక్ బోన్.. ఇది పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్. ఫ్యామిలీతో కలసి చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు ఎంజాయ్ చేసే సినిమా ఇది. తెలుగులో విడుదల చేస్తున్న సురేష్ ప్రొడక్షన్ కి ధన్యవాదాలు' తెలిపారు.
 
హీరోయిన్ తమన్నా భాటియా మాట్లాడుతూ.. 'బాక్' చాలా కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం. సుందర్ సి గారు ఎంత మంచి డైరెక్టరో చెప్పడానికి ట్రైలర్ ఒక ఉదాహరణ. విమన్ పవర్ ని సెలబ్రేట్ చేసే డైరెక్టర్ సుందర్ గారు. ఈ వేడుకలో ఆయన తరపునుంచి ఖుష్బు గారు వుండటం చాలా ఆనందంగా వుంది.  రాశిని బెంగాల్ టైగర్ నుంచి చూస్తున్నాను. తను చాలా జెన్యూన్ పర్సన్. ఈ సినిమా అయ్యయో ప్రమోషనల్ సాంగ్ ని చేసినప్పుడు ఇద్దరం కలసి చాలా ఎంజాయ్ చేశాం.  హిప్హాప్ తమిళా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కిచ్చ ఇచ్చిన విజువల్స్ రిచ్ గా వుంటాయి. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం.  సుందర్ గారి విజన్ ని అర్ధం చేసుకొని మీ అందరికీ మంచి సినిమా ఇవ్వలానే లక్ష్యంతో పని చేశాం. తప్పకుండా ఈ సినిమాని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. కోవై సరళ గారిని తెలుగు మ సినిమాల్లో ఇంకా చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. సురేష్ ప్రొడక్షన్ కి, జాన్వీ గారికి ధన్యవాదాలు. మే3న తప్పకుండా సినిమాని ఫ్యామిలీతో పాటు చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు' అన్నారు.