శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 నవంబరు 2023 (19:04 IST)

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్లాట్.. ఎవరు కొంటారో? ఆదాశర్మ?

sushanth
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ముంబై బాంద్రాలోని ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉండే సుశాంత్.. ఆ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెపోటిజంకారణంగానే అతను మరణించాడనే వాదన కూడా అప్పట్లో బలంగా వినిపించింది. 
 
అయితే ప్రస్తుతం సుశాంత్ నివసించిన ఇంటికి సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. సుశాంత్ నివసించిన ఆ ఫ్లాట్ చాలా స్పెషల్‌గా వుంటుందట. స‌ముద్రానికి ఎదురుగా ఉన్న ఈ ప్లాట్‌కు అత‌డు నెల‌కు దాదాపు  4.5 ల‌క్ష‌లు కట్టేవారని సమాచారం. 

తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంటిని అమ్మకానికి పెట్టారన్న వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు తెలుగు హీరోయిన్ ఆదా శర్మ ఇంట్రస్ట్ చూపిస్తోందని వార్తలు గతంలో వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫ్లాట్‌ను అమ్మకానికి పెట్టారు. మరి సుశాంత్ ఫ్లాటును ఎవరో కొంటారోననే ప్రస్తుతం ఆసక్తిగా మారింది.