మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (09:41 IST)

కుర్ర బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్... త్వరలో పెళ్లి.. మాజీ యూనివర్స్

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ ఓ కుర్ర మోడల్‌తో గుట్టుచప్పుడుకాకుండా ప్రేమాయణం సాగిస్తోంది. దీనిపై బాలీవుడ్‌లో తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతున్నా ఆమె మాత్రం ఎక్కడా కూడా పెదవి విప్పలేదు. ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్న సుష్మితా.. ఓ కుర్ర మోడల్‌తో ప్రేమాయణం కొనసాగిస్తూ డేటింగ్‌లో పాల్గొనడంపై చాలా మంది విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ ఆమె మాత్రం కించిత్ మాట అనలేదు. 
 
ఈనేపథ్యంలో సుష్మితాసేన్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా సుష్మిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్.. ఆ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చాయి. దీపావళి పర్వదినాన తన ఇద్దరూ కుమార్తెలతో పాటు.. తన బాయ్ ఫ్రెండ్‌, మోడల్ రొహ్మాన్ షాల్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది. 
 
అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. సుష్మిత ప్రేమలో ఉన్నట్లు అర్థమవుతోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా, ఇద్దరు ఆడపిల్లలను సుష్మిత దత్తత తీసుకుని పెంచి పోషిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఇద్దరు ఆడపిల్లలకే ఆమె తల్లిగా ఉంది.